సాధారణంగా ముల్లంగిని తినేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. చలికాలంలో ముల్లంగి అనారోగ్య సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ సహాయపడుతుంది. ముల్లంగి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మూత్ర పిండాల నుంచి కాలేయం వరకు అన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే కొందరికి మాత్రం ముల్లంగి తింటే గ్యాస్ సమస్య పెరుగుతుంది. అందుకే దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. ముల్లంగి తినగానే కడుపులో గ్యాస్ సమస్య మొదలవుతుంది. అయితే ముల్లంగిని ఇతర పదార్థాలతో తీసుకోవడం వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది. మరీ ఆ పదార్థాలు ఎంటో తెలుసుకుందామా.
ఖాళీ కడుపుతో ముల్లంగిని అస్సలు తీసుకోవద్దు. ఇలా తింటే గ్యాస్ సమస్య కల్గుతుంది. అంతేకాదు..రాత్రిళ్లు ముల్లంగిని తీసుకోవడం మానుకోవాలి. రాత్రిళ్లు దీనిని తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య కల్గుతుంది. మధ్యాహ్న భోజనంలో ముల్లంగిని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ముల్లంగి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక ముల్లంగి సలాడ్ తినాలనుకుంటున్నా వారు నల్ల ఉప్పుతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే గ్యాస్ సమస్య ఉండదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన కడుపులో ఆమ్ల స్వభావం తక్కువగా ఉంటుంది. దీంతో గ్యాస్ సమస్య ఏర్పడదు.
ముల్లంగి పరాఠాలను తీనాలనుకుంటే దానితో సెలెరీని తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వలన కడపులో గ్యాస్ సమస్య ఉండదు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముల్లంగి పరాఠాలను తీసుకున్న ప్రతిసారి దాంతోపాటు క్యారట్స్ కూడా తీసుకోవాలి. ఇక కొందరికి ముల్లంగి తింటే చర్మంపై దురదలు.. ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అలాంటివారి ముల్లంగితోపాటు పెరుగు కలిపి తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా ముల్లంగి పరాఠాతోపాటు.. పెరుగు కలిపి తింటే మంచిది. ఇలా చేయడం వలన పెరుగు ముల్లంగి ప్రభావన్ని తగ్గిస్తుంది. దీంతో గ్యాస్ సమస్య ఏర్పడదు.
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..