Pomegranate Benefits: దానిమ్మతో బోలెడన్నీ ప్రయోజనాలు.. రక్తపోటుకు చెక్.. బరువు తగ్గించడంలోనూ బెస్ట్..

|

Nov 13, 2021 | 9:32 AM

దానిమ్మతో అనేక ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో అనేక పోషకాలున్నాయి. దానిమ్మలో 7 గ్రాముల ఫైబర్,

Pomegranate Benefits: దానిమ్మతో బోలెడన్నీ ప్రయోజనాలు.. రక్తపోటుకు చెక్.. బరువు తగ్గించడంలోనూ బెస్ట్..
Pomegranate
Follow us on

దానిమ్మతో అనేక ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో అనేక పోషకాలున్నాయి. దానిమ్మలో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సీ, 16 శాతం ఫోలేట్, 12 శాతం పొటాషియం ఉన్నాయి. ఒక కప్పు దానిమ్మ 24 గ్రాముల చక్కెరను.. 144 కేలరీల శక్తిని అందిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతో మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్, ఊబకాయం వంటి వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఉంటుంది. దానిమ్మ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో దానిమ్మ పండును తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, సీ, ఇ ఉంటాయి. దానిమ్మ ఆర్థరైటిస్ సమస్యను నివారిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దానిమ్మతో కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా.

రెండు వారాలపాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసం తీసుకోవడం వలన రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో రక్తపోటును తగ్గించడంలో దానిమ్మ ఎక్కువగ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహయపడుతుంది. శస్త్రచికిత్స జరిగిన రోగులకు 2 గ్రాముల దానిమ్మ పళ్లను ఇచ్చినప్పుడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్ సమస్యను తగ్గించడంలోనూ దానిమ్మ ఎక్కువగా ఉపయోగపడుతున్నట్లుగా ఓ అధ్యాయనంలో తేలింది. దానిమ్మ బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా.. పోషకాలు పుష్కలంగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే దానిమ్మ పండు రసాన్ని రోజూ తీసుకోవాలి.

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. దానిమ్మను తీసుకోవడం వలన యవ్వనంగా కనిపిస్తారు. ఇది యాంటీ ఏజింగ్ మూలం. దానిమ్మలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వలన నోటిలో ఫలకం ఏర్పడకుండా చేస్తాయి. దానిమ్మ రంస చిగురువాపు.. పీరియాంటైటిస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రీ రాడికల్స్ తో పోరాడి కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

Also Read: Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..