Rosemary: ఈ మొక్కతో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒత్తిడి ఫసక్.. రోగ నిరోధక శక్తిని పెంచే రోజ్మేరీ మొక్కతో ఎన్నో ప్రయోజనాలు..

| Edited By: Anil kumar poka

Oct 26, 2022 | 2:43 PM

సాధారంగా మొక్కలతో ఎన్నో సమస్యలకు తగ్గించవచ్చు అన్న విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ.. ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని

Rosemary: ఈ మొక్కతో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒత్తిడి ఫసక్.. రోగ నిరోధక శక్తిని పెంచే రోజ్మేరీ మొక్కతో ఎన్నో ప్రయోజనాలు..
Rosemary
Follow us on

సాధారంగా మొక్కలతో ఎన్నో సమస్యలకు తగ్గించవచ్చు అన్న విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ.. ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే రోజ్మేరీ మొక్క వలన మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని పెంచడం.. ఒత్తిడిని దూరం చేయడంలో ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య ఒత్తిడి. మారుతున్న జీవనశైలి.. పని ఒత్తిడి.. కుటుంబ సమస్యలతో చాలావరకు డిప్రెషన్‏కు గురవుతుంటారు. అయితే ఈ రోజ్మేరీ మొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజ్మేరీ మొక్కను గుల్మెహంది అని కూడా పిలుస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్, చిత్తవైకల్యం ఉన్న రోగులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులోని సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. రోజ్మేరీ ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా.. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఒత్తిడిని తగ్గించేందుకు రోజ్మేరీ మొక్క వాసన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వాసన.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగో మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. ఆందోళనను తగ్గిస్తుంది. ఈ మొక్క నుంచి తయారు చేసిన నూనె ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అలాగే రోజ్మేరీ మొక్క ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో గార్గ్లింగ్ చేయడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. జుట్టు సమస్యలను కూడా రోజ్మేరీ మొక్క నూనె తగ్గిస్తుంది. జుట్టు రాలడం.. పొడిబారడం వంటి సమస్యలను తగ్గించడంలో రోజ్మేరీ నూనె ఎక్కువగా పనిచేస్తుంది. రోజ్మేరీ నూనెతో  తలకు మర్దనా చేయడం వలన ఒత్తిడి తగ్గడమే కాకుండా.. ప్రశాంతత కలుగుతుంది.

Also Read:  Health Tips: ఈ అలవాట్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువేనట.. అవెంటో తెలుసుకోండి..

Nagarjuna : మన్మధుడి సినిమా అంటే మాములుగా ఉండదు మరి.. ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌తో…