చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్వీట్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా శుభసమయాలలో.. పండగ రోజులలో ఇంట్లో రకరకాల స్వీట్స్ ఉండాల్సిందే. అందులో మరీ ముఖ్యంగా జిలేబీని ఇష్టపడనివారుండరు. నార్త్ ఇండియాలో జిలేబీ చాలా ఫేమస్. దీపావళీ రోజులలో ఈ స్వీట్‌కు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా మందికి జిలేబీని పాలతో కలిపి తినే అలవాటు ఉంటుంది. జిలేబీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా ? అని ఎప్పుడైనా ఆలోచించారా ? పాలతో కలిపి జిలేబీ తీసుకోవడం మంచిదా లేదా ఇప్పుడు తెలుసుకుందామా.
పాలతో జిలేబీ కలిపి తీసుకుంటే సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. అలాగే ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీనివలన ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగ ఏకాగ్రత పెరుగడమే కాకుండా మీ మూడ్ బాగుంటుంది. పాలు.. జిలేబీ కలిపి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి సమస్యను తగ్గుతుంది. అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పాలు, జిలేబీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉండడమే కాకుండా తలనొప్పి సమస్య తగ్గుతుంది. ఇవి రెండు కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. జిలేబీలో చాలా కేలరీలు ఉంటాయి. అందుకే బరువు పెరగడంలోనూ సహయపడుతుంది. బరువు పెరగాలనుకునేవారు.. ఉదయాన్నే ఒక గ్లాసు పాలలో జిలేబీ కలిపి తీసుకోవచ్చు. పాలు, జిలేబీ కలిపి తీసుకోవడం వలన జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కూడా తగ్గుతుంది. రోజు వేడి పాలలో జిలేబీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.
Cold Water Shower: స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Dates Benefits: చలికాలంలో ఖర్జురాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? ప్రయోజనాలు తెలుసుకోండి..
Turmeric Benefits: పసుపు క్యాన్సన్ నివారణకు ఉపయోగపడుతుందా..? పరిశోధనలలో కీలక అంశాలు వెల్లడి..!