Navratri 2021: గర్బిణీలు, పాలిచ్చే మహిళలు నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…

|

Oct 05, 2021 | 7:29 PM

నవరాత్రులు అక్టోబర్ 7 నుంచి ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల అమ్మవార్లను తొమ్మిది రకాలుగా పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అమ్మవారికి

Navratri 2021: గర్బిణీలు, పాలిచ్చే మహిళలు నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...
Navratri 2021
Follow us on

నవరాత్రులు అక్టోబర్ 7 నుంచి ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల అమ్మవార్లను తొమ్మిది రకాలుగా పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు ఉపవాసం ఉంటూ ఒక్కో అమ్మవారిని పూజిస్తుంటారు. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గర్భిణీలు, స్త్రీలు, పాలిచ్చే మహిళలు ఉపవాసం ఉంటారు. అయితే కొన్నిసార్లు మహిళలు.. తమకు తెలియకుండానే తమ ఆరోగ్యం పట్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. అందుకే నవరాత్రి ఉపవాసంలో గర్భిణీలు, పాలిచ్చే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.

గర్భిణీలు, పాలిచ్చే మహిళలు నవరాత్రి ఉపవాసంలో బంగాళాదుంపలు, ఖీర్, సాబుదానా, పకోర వంటి ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. ఇవి బరువు పెరగడంలో సహాయపడతాయి. దీనితో పాటు వాటిని తినడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలామంది మహిళలు ఉపవాస సమయంలో ఉప్పు తినరు. దీంతో వారు తొందరగా బలహీనపడిపోతారు. ఇవే కాకుండా.. ఇది రక్తపోటుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం మానుకోండి. నవరాత్రి ఉపవాస సమయంలో రాతి ఉప్పును ఉపయోగించండి. గర్భిణీ స్త్రీలు నీరు లేకుండా ఉపవాసం ఉండకూడదు. గర్భిణీ స్త్రీలు నిర్జలను ఉపవాసం చేయకూడదు. ఉపవాస సమయంలో తరచుగా నీరు త్రాగుతూ ఉండండి. ఉపవాసం పాటించడం గురించి ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఉపవాసం మీకు, మీ బిడ్డకు హాని కలిగించదని డాక్టర్ సూచిస్తే అప్పుడు ఉపవాసం చేయడం మంచిది.

ఎట్టి పరిస్థితుల్లోనూ మీ శరీరాన్ని గాయపరచవద్దు. గర్భవతిగా ఉన్నప్పుడు మీకు, మీ బిడ్డకు శక్తి అవసరం. ఉపవాస సమయంలో శరీరానికి శక్తిని ఇవ్వడానికి అవసరమైన తాజా పండ్లు, అటువంటి పదార్థాలను తీసుకోవాలి. కొందరు ఎక్కువ సమయం ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వలన శరీరంలో బలహీనత, అసిడిటీ, తలనొప్పి, రక్తహీనత ఉంటాయి. అలాగే నిద్ర వచ్చినట్లు అనిపించినా.. బలహీనంగా అనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉపవాసం చేసేటప్పుడు కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాకుండా.. ద్రవపదార్థాలను తీసుకోవాలి. అంటే.. మజ్జిగ, రసం, పాలు, నీరు తీసుకుంటూ ఉండాలి.

Also Read: Aryan Khan Arrest: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి… కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..

Bigg Boss 5 Telugu: రాజ్యానికి రాజయ్యేది ఎవరు.? ఆసక్తికరంగా బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌.. సిరి, షణ్ముఖ్‌ ఎందుకలా చేశారు.?