Sugarcane Juice
మారుతున్న సీజన్‌లో దగ్గు, జలుబు సమస్య సర్వసాధారణంగా మారిపోయాయి. దీని వల్ల గొంతు నొప్పితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు(Cold and Cough) ఏ సీజన్‌లోనైనా రావచ్చు. అయితే ఈ చిన్న సమస్యలకు ప్రతిసారీ మీరు వైద్యుడి వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.. ఎందుకంటే దాని చికిత్సకు ఔషదాలు మన చుట్టూనే లభిస్తుంటాయి. అవును, మీరు కూడా దగ్గుతో బాధపడుతున్నట్లయితే.. మీరు ఈ ఆయుర్వేద చిట్కాను ప్రయత్నించవచ్చు. ఈ ఆయుర్వేద చిట్కాలో కీలకం చెరకు రసం(Sugarcane juice). చెరకు రసానికి దగ్గును తగ్గించే శక్తి ఉంది. కాబట్టి ఈ పద్దతని అనుసరించడం ద్వారా దగ్గు సమస్యను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం.
- ముందుగా చెరకు తాజా రసాన్ని తీసుకోండి.
- ఆ తరువాత, ముల్లంగి తురుము నుంచి దాని రసం తీయండి.
- ఇప్పుడు యాభై గ్రాముల ముల్లంగి రసంలో ఒక గ్లాసు చెరుకు రసం కలిపి త్రాగాలి.
- మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం ముందు ఒక వారం పాటు త్రాగాలి.
- ఇలా చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
చెరకు రసం ఇతర ప్రయోజనాలు
- చెరుకు రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల కామెర్లు పోతాయి.
- చెరకు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది.
- అంతే కాకుండా మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది.
- చెరుకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- చెరుకు రసం తాగడం వల్ల ఎక్కిళ్ల సమస్య కూడా తొలగిపోతుంది.
- చెరకు రసంలో నల్ల ఉప్పు కలిపి సేవిస్తే వాంతులు ఆగుతాయి.
ఇవి కూడా చదవండి: Tirupati: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్‌తో డీల్ కుదరని పీకే కొత్త పార్టీ పెట్టబోతున్నారా?