Diwali – Sweets: రంగు రంగుల స్వీట్లతో జర జాగ్రత్త..! ఇలాంటివి తింటే.. ప్రమాదకర జబ్బులను కొనితెచ్చుకున్నట్లే..

|

Oct 23, 2022 | 10:01 AM

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. పండుగ కావడంతో మార్కెట్‌లోని దుకాణాల్లో రంగురంగుల మిఠాయిలు దర్శనమిస్తున్నాయి.

Diwali - Sweets: రంగు రంగుల స్వీట్లతో జర జాగ్రత్త..! ఇలాంటివి తింటే.. ప్రమాదకర జబ్బులను కొనితెచ్చుకున్నట్లే..
Sweets
Follow us on

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. పండుగ కావడంతో మార్కెట్‌లోని దుకాణాల్లో రంగురంగుల మిఠాయిలు దర్శనమిస్తున్నాయి. అయితే, దుకాణాల్లో విక్రయించే ఈ మిఠాయిల వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ స్వీట్లు ఆరోగ్యానికి ప్రమాదకరం. స్వీట్లలో కలిపిన పదార్థాలు జీర్ణవ్యవస్థతో పాటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతాయి. కాలేయం కూడా ప్రమాదం బారిన పడుతుంది. పేగులో ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పితోపాటు పలు అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.

నాసిరకం పాలకోవాతో డేంజర్..

మనం స్వీట్ల గురించి మాట్లాడితే.. అందులో నాణ్యత లేని పాలకోవాను ఉపయోగిస్తారు. చాలా రోజులు ఉంచిన కోవాను వేడి చేసి తాజాగా విక్రయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షించిన తర్వాతే ఆహార పదార్థాలను కొనుగోలు చేయడం ముఖ్యం. మంచి సువాసన, ఫ్రెష్‌గా కనిపించడానికి శరీరానికి హాని కలిగించే అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు.

సిల్వర్ ఫాయిల్‌ మిఠాయిలతో జాగ్రత్త..

ప్రస్తుతం మార్కెట్‌లో సిల్వర్ ఫాయిల్ పూసి మిఠాయిలు విక్రయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే.. దీనిని గుర్తించాలంటే.. స్వీట్ల పై ఉన్న సిల్వర్ కోటెడ్‌ను మనం చేతులతో రఫ్ చేస్తే పోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పండుగ రోజున కలిసే వారికి రంగురంగుల స్వీట్‌లు ఎక్కువగా ఇవ్వొద్దని పేర్కొంటున్నారు. స్వీట్ ఎప్పుడు తయారు చేస్తారు, ఎంత సేపు తినవచ్చు అనేది గమనించాలి. పాలలో యూరియా వంటి ప్రమాదకరమైన మందులను సైతం కలిపి కల్తీ చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ వచ్చే ప్రమాదం

స్వీట్లలో రసాయన రంగులను వాడతారు. ఫుడ్ కలరింగ్ వాడితే అది ప్రాణాంతకం కాదు.. కానీ.. రసాయన రంగులతో మాత్రం ప్రమాదం ఎక్కువని పేర్కొంటున్నారు. ప్రస్తుతం స్వీట్లలో కూడా ఇలాంటి రంగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రంగులు కార్బన్, భారీ లోహాలను కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీనివల్ల వచ్చే అలర్జీ వల్ల ఆస్తమా వ్యాధి వస్తుంది. ఇలాంటి స్వీట్లను ఎక్కువ సేపు తినడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది.

ఎలాంటి ప్రమాదం వస్తుంది..

  • కాస్టిక్ సోడా: రక్తపోటును పెంచుతుంది
  • యూరియా: కాలేయం – మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం
  • రంగు: అలెర్జీలు, ఉబ్బసం, మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్ ప్రమాదం
  • ఉడికించిన బంగాళదుంపలు, చిలగడదుంపలు: కడుపు నొప్పి, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్ ను పెంచుతాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • రంగురంగుల స్వీట్లు కొనడం మానుకోండి
  • పండుగ రోజు ఇంట్లో స్వీట్లు తయారు చేసుకోండి
  • బజారులో తయారయ్యే వస్తువులకు దూరంగా ఉండండి
  • షుగర్ పేషెంట్ స్వీట్లు తినకుండా ఉండండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..