మద్యం కన్నా డేంజరస్ డ్రింక్ ఇదే.. తాగారంటే మీ కిడ్నీలు గుల్లగుల్లే..

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలు ఫిల్టర్లుగా పనిచేసి.. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరం నుండి వ్యర్థాలు, విషాలు, అదనపు ఉప్పును తొలగిస్తాయి. అలాంటి కిడ్నీలు దెబ్బతినడం వల్ల శరీరంపై వినాశకరమైన ప్రభావం పడుతుంది. అందుకే.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి..

మద్యం కన్నా డేంజరస్ డ్రింక్ ఇదే.. తాగారంటే మీ కిడ్నీలు గుల్లగుల్లే..
Kidney Health

Updated on: Dec 10, 2025 | 3:27 PM

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలు ఫిల్టర్లుగా పనిచేసి.. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరం నుండి వ్యర్థాలు, విషాలు, అదనపు ఉప్పును తొలగిస్తాయి. అలాంటి కిడ్నీలు దెబ్బతినడం వల్ల శరీరంపై వినాశకరమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఆల్కహాల్ మాత్రమే మూత్రపిండాల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే, మద్యం కంటే.. మూత్రపిండాలకు హాని కలిగించే డేంజరస్ పానీయం కూడా ఉంది. ఏ పానీయాలు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయో AIIMS యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం..

యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూత్రపిండాలకు హాని కలిగించే డ్రింక్స్ గురించి వివరించారు.. ఎనర్జీ డ్రింక్స్ మూత్రపిండాలకు చాలా ప్రమాదకరమని.. దీనికి దూరంగా ఉండాలంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ రోజుల్లో, ఎనర్జీ డ్రింక్స్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుందని.. దీనివల్ల కిడ్నీల ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని తెలిపారు.

WHO హెచ్చరిక జారీ చేసింది..

డాక్టర్ పర్వేజ్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎనర్జీ డ్రింక్స్ గురించి హెచ్చరిక జారీ చేసింది. అలాంటి పానీయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు వాటిని రోజూ తాగితే.. అది ప్రమాదకరం కావచ్చు. ముందుగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మానుకోవాలని సూచించారు.

మూత్రపిండాలకు ఏది మేలు చేస్తుంది?

మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగండి. నిమ్మకాయ నీరు కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ ఆహారంలో అల్లం నీరు – హెర్బల్ టీని కూడా చేర్చుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..