
కర్పూరవల్లి ఒక అద్భుతమైన ఔషధ మొక్క. దీన్నే వాము ఆకు అని కూడా పిలుస్తారు. ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు. దీని ఆకులు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు కర్పూరవల్లి ఆకుల రసం తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసాన్ని నుదురు, ఛాతీపై రాసుకోవడం వల్ల ఊపిరి తీసుకోవడం సులభమవుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కర్పూరవల్లి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. అజీర్ణం, మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అంతేకాకుండా, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి కూడా కర్పూరవల్లి ఆకులు మేలు చేస్తాయి.
శరీరానికి హాని కలిగించే ఇన్ఫెక్షన్ల నుంచి కర్పూరవల్లి ఆకులు రక్షణ కల్పిస్తాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్రిమి కాటు వల్ల వచ్చే వాపు, నొప్పిని తగ్గిస్తాయి. చిన్న గాయాలకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కర్పూరవల్లి ఆకులు ముందుంటాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతుంది.
నొప్పి, వాపు వంటి సమస్యలతో బాధపడేవారికి కర్పూరవల్లి ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ల నొప్పుల వల్ల వచ్చే బాధను తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. కడుపు సంబంధిత సమస్యలైన అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి వాటిని నివారించడంలోనూ కర్పూరవల్లి ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ ఆకుల్లోని యాంటీవైరల్ గుణాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి.
కాబట్టి, కర్పూరవల్లి ఆకులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ఒక సహజసిద్ధమైన ఔషధం. దీనిని ఉపయోగించడం ద్వారా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను మెరుగు పరచుకోవచ్చు. అందుకే ఆయుర్వేదంలో ఈ మొక్క ప్రయోజనాలను విరివిగా చెప్తుంటారు. దీని ఆకులను వివిధ ఔషధాల్లో వాడుతుంటారు.