Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

|

Mar 03, 2022 | 3:03 PM

పచ్చ కామెర్లు.. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే ఈ వ్యాధికి గుర్తులు. ఈ వ్యాధి.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వచ్చే వ్యాధి.

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..
Diet Chart
Follow us on

పచ్చ కామెర్లు.. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే ఈ వ్యాధికి గుర్తులు. ఈ వ్యాధి.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వచ్చే వ్యాధి.. రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం అధికంగా చేరడం వలన ఈ సమస్య వస్తుంది. దీంతో ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ పోయాక మిగిలిపోయే భాగం… బైలిరుబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది. అయితే ఈ బైలిరుబిన్ సమస్యను కాలేయం తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు వలన కాలేయ పనితీరు దెబ్బతింటుంది. దీంతో పచ్చకామేర్ల వ్యాధి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చర్మం, కళ్లు పచ్చగా మారడమే కాకుండా.. జ్వరం, అలసట, బలహీనంగా ఉంటారు. పచ్చ కామెర్ల వ్యాధి సోకినప్పుడు సదరు వ్యక్తి తీసుకునే ఆహారపదార్థాలలో జాగ్రత్తలు పాటించాలి. కామెర్లు త్వరగా పోవడానికి వీరు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుందామా..

కామెర్ల సమస్యతో బాధపడుతున్నవారు.. ఎక్కువగా లిక్విడ్ డైట్ ఫాలో కావాలి. ఇందుకు వీరు ఎక్కువగా సూప్స్ తీసుకోవడం మంచిది. వీటిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అలాగే.. నారింజ, బెర్రీలు, బొప్పాయి, యాపిల్స్ వంటి పండ్లలో జీర్ణక్రియ ఎంజైములు, విటమిన్లు, సి,కే, బి ఉంటాయి. అరటిపండ్లు, బ్రోకలీ, క్యారెట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కాలేయంలో విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

కామెర్లు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగాలి. వీరు కొన్ని నిమ్మకాయ, పుదీనా, దోసకాయ కలిపిన నీరు తీసుకోవడం మంచిది. రోజంతా నీటిని తాగడం వలన ఎలక్ట్రోలైట్ సమతుల్యత కాపాడుతుంది. బలహీనత దూరమవుతుంది. కండరాలను బలంగా ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గింజలు, చిక్కుళ్లు, లీన్ మాంసం, చీజ్ వంటివి తినడం వలన కాలేయం మెరుగ్గా ఉంటుంది. కొబ్బరి నీటిలో పోషకాలు అనేకం ఉంటాయి. ఇది మీ శరీరం ప్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే పచ్చ కామెర్లను తగ్గించడంలో సహయపడుతుంది.

ఫైబర్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్‏లను బయటకు పంపి కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ముఖ్యం. బియ్యం, ధాన్యాలు తీసుకోవడం వలన జీవక్రియ పెరుగుతుంది. కానీ.. కార్బోహైడ్రేట్స్ అతిగా తినకూడదు. బఠానీలు, ఆస్పరాగస్, అవకాడోలు, సెలెరీ, టోమాటోలు, నిమ్మకాయలు, ద్రాక్ష, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం కాలేయాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చకామెర్లు ఉన్నవారు హెవీ క్రీమ్, ఆల్కహాల్, రెడ్ మీట్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. నిపుణుల సూచనల పరంగా మాత్రమే ఇవ్వబడింది. పైన పేర్కోన్న డైట్ ఫాలో కావడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోన్న భీమ్లానాయక్‌.. ఆరు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

AHA OTT: బాల్య వివాహాలపై ఆహా సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఖుబూల్‌ హై’.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే..

Bollywood Celebs: ఈ బాలీవుడ్ సుందరీమణులు నాజుగ్గా ఉంటారు.. కానీ మంచి ఆహారప్రియులు.. నచ్చిన ఫుడ్ కనిపిస్తే వదలరు