శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. చాలా మంది ఈ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలు పనిచేయకుండా పోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు పనిచేస్తాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. మరీ అవెంటో తెలుసుకుందామా..
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండడం వలన వ్యర్థ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. వీటితోపాటు క్యాబేజీ కూడా మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. కిడ్నీలు సరిగా పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక ఉల్లి పాయలు కూడా మూత్రపిండాలను రక్షించడానికి తోడ్పడుతాయి. ముఖ్యంగా కిడ్నీలో ఉండే రాళ్ళను తొలగిస్తాయి. ఇక శనగలు, పెసర్లు వంటి మొలకెత్తిన విత్తనాలను రోజూ తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలు శుభ్రపడటమే కాకుండా రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ తినడం వలన న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ప్లమేటరి క్యాలిటీస్ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ పనిచేసేందుకు సహయపడతాయి.
Also Read:
కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానమా? .. అయితే ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..