
చింతపండులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో పాటు మెగ్నీషియం, పొటాషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు చాలా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. చింతపండు గింజలను వేయించి పొడి చేసి సూప్, స్మూతీలు, సాస్ లలో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
చింతపండు విటమిన్ C ఎక్కువగా కలిగి ఉండటం వలన శరీర రోగనిరోధక శక్తి పెరగడానికి సాయపడుతుంది. కొన్ని సహజ చికిత్సల్లో చింతపండు ఉపయోగపడుతుందని భావిస్తున్నప్పటికీ.. దీని ప్రభావం ఎంత అని నిర్ధారించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరం. కాబట్టి దీన్ని ప్రధాన చికిత్సగా కాకుండా.. కేవలం సహాయపడే ఆహారంగా మాత్రమే చూడటం మంచిది.
చింతపండు ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఇతర పోషకాలు ఇస్తుంది. ప్రాసెస్ చేసిన చింతపండు ఉత్పత్తుల కంటే తాజా చింతపండు మంచిది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన వాటిలో ఎక్కువ సోడియం ఉంటుంది. రోజూవారీ ఆహారంలో చింతపండును కొద్దిగా చేర్చడం ద్వారా దాని లాభాలు పొందవచ్చు. కానీ ముఖ్యంగా యాంటీ-డిప్రెసెంట్ లేదా ఇతర మందులు తీసుకుంటున్నవారు మొదట డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)