Bread: ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

|

Aug 14, 2022 | 6:23 PM

Health Tips: బ్రెడ్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే బ్రెడ్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

Bread: ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
Bread
Follow us on

Health Tips: బ్రెడ్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే బ్రెడ్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇతర ఫుడ్స్‌తో పోల్చితే పోషకాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. ఈక్రమంలో ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

మలబద్ధకంతో పాటు..

నిద్రలేచిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దు. ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. అతిగా తినేలా చేస్తుంది. ఫలితంగా ఊబకాయం సమస్యలు తలెత్తుతాయి. ఇక వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్‌ (GI) స్థాయులు కూడా అధికంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఆకలిని పెంచడంతో పాటు అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తాయి. తద్వారా అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలు కలుగుతాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక బ్రెడ్‌లోని కార్బోహైడ్రేట్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. కాబట్టి బ్రెడ్‌ తినేముందు ఏదైనా తేలికగా జీర్ణమయ్యే ఇతర ఆహారపదార్థాలను తీసుకోండి. వైట్ బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరంతో పాటు ఉదర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో బ్రెడ్‌ను తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..