Banana Benefits: ఆ సమయంలో అరటి పండు తినకూడదా?.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..!

|

Oct 23, 2021 | 6:49 AM

Banana Benefits: ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా కడుపు నొప్పి అనేది చాలా మందికి సర్వసాధారణ సమస్యగా మారింది. అయితే, అందులోని రకరకాల ఉదర సంబంధిత సమస్యలు ఉంటాయి.

Banana Benefits: ఆ సమయంలో అరటి పండు తినకూడదా?.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..!
Elens
Follow us on

Banana Benefits: ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా కడుపు నొప్పి అనేది చాలా మందికి సర్వసాధారణ సమస్యగా మారింది. అయితే, అందులోని రకరకాల ఉదర సంబంధిత సమస్యలు ఉంటాయి. తీవ్రమైన సమస్యలు మినహా.. సాధారణ సమస్యలను లైట్ తీసుకోవచ్చు. అంతర్లీనంగా సీరియస్ సమస్యలు ఉంటే మాత్రం తక్షణమే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి అజీర్తి కారణంగా చాలామంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఇంకా ఆకలితో, అసిడిటితో బాధపడుతుంటారు. కడుపు నొప్పి వస్తున్నప్పుడు సహజంగానే ఉపశమన చర్యలు తీసుకుంటాం.

అయితే, చాలా మంది కడుపు నొప్పు సమయంలో అరటి పండ్లు తినొద్దని చెబుతుంటారు. తద్వారా కడుపు నొప్పి సమస్య మరింత పెరిగిద్దని అంటుంటారు. అందుకే అరటి పండు తినొద్దని చెబుతుంటారు. అయితే, అదంతా ట్రాష్ అని ఆరోగ్య నిపుణులు కొట్టిపడేస్తున్నారు. అరటి పండ్లు తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయే తప్ప.. ఎక్కువ కావని క్లారిటీ ఇస్తున్నారు. అరటి పండు తినడం వలన మంచే జరుగుతుందని ఉద్ఘాటిస్తున్నారు. ఇందులో ఉండే యాంటాసిడ్ వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయంటున్నారు.

కడుపు నొప్పి తగ్గడానికి ఏం చేయాలి..
ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఈ నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదంటే.. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ చక్కెర వేసి రెండింటిని బాగా కలుపుకొని తాగాలి. కుదరకపోతే.. జీలకర్ర, చక్కెర రెండింటిని బాగా నమిలి తినాలి. దీనివల్ల కడుపు నొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే.. తినే ఆహారం మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పప్పులు, ఆకు కూరతు, పీచు పదార్థాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. తద్వారా కడుపు నొప్పి రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

Also read:

T20 World Cup 2021: నేటి నుంచే రియల్ క్రికెట్ వార్.. తొలిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనున్న సౌతాఫ్రికా..

Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్

DRDO Abhyas: లక్ష్యం వైపు దూసుకెళ్లిన ‘అభ్యాస్’.. డీఆర్డీవో పరీక్ష విజయవంతం..