Health Tips: తగినంత నిద్ర లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త.!!

|

May 06, 2021 | 10:05 PM

Incomplete Sleep: పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో అనేక మంది రాత్రి పూట తగినంత సమయం నిద్రపోలేకపోతున్నారు...

Health Tips: తగినంత నిద్ర లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త.!!
Sleepiing Disorder
Follow us on

Incomplete Sleep: పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో అనేక మంది రాత్రి పూట తగినంత సమయం నిద్రపోలేకపోతున్నారు. నిత్యం ఇలానే సరైనంతగా నిద్ర లేకపోతే చాలా ప్రమాదం అని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రతీ వ్యక్తికి కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం అంటున్నారు. సరైన నిద్ర లేకపోతే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మన శరీరం ,మెదడు కూడా సరిగ్గా పనిచేయదని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఒత్తిడి, కోపం, నిరాశ…

తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు సరిగ్గా పని చేయదు. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడితో మీరు ఏ పనిని సరిగ్గా చేయలేరు. అలాంటప్పుడు కోపం, చికాకు, నిరాశ వంటి సమస్యలు ఎదురవుతాయి.

గుండె సంబంధిత రోగాలు..

సరిగ్గా నిద్రపోలేకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఆ సమయంలో గుండెపై ఎక్కువ ప్రభావం పడుతుంది. బీపీ, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల ఎదురయ్యే ప్రమాదం ఉంది.

రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది…

కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి వైద్య నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. ఇమ్యూనిటీ పెరగడానికి సరైన నిద్ర కూడా ఉండాలి. అలా లేకపోతే రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, జ్వరం మొదలైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.

రొమ్ము క్యాన్సర్ ప్రమాదం…

తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీర కణాలకు బాగా నష్టం వాటిల్లుతుందని, దీని వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే తగినంత నిద్ర మనిషికి చాలా అవసరమని డాక్టర్లు అంటున్నారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?