Summer Super Foods: వేసవిలో ఎండ, చెమట నుంచి ఉపశమనం పొందాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తుల దగ్గర నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు అన్నిటిపై శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి పని చేస్తాయి. అలాంటి వాటిలో పుచ్చకాయ, దోసకాయ, పుదీనా మొదలైనవి ఉంటాయి. ఇవి కాకుండా మరికొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. పెరుగు
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో పెరుగుతో చేసిన లస్సీ, మజ్జిగ తాగితే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెరుగుతో అనేక ఇతర వంటకాలని కూడా తయారుచేసుకోవచ్చు.
2. పుదీనా
పుదీనా శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో పుదీనా మజ్జిగ లేదా పుదీనా చట్నీ తీసుకోవచ్చు. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. కొబ్బరి నీరు
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పొట్టను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
4. పుచ్చకాయ
పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది మీకు చాలా కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు దీన్ని చాట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పుచ్చకాయలో ఎండుమిర్చి, ఉప్పు, చాట్ మసాలా వేసుకొని తినాలి.
5. దోసకాయ
దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సలాడ్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. వేసవిలో మీ ఆహారంలో దోసకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది అన్ని వయసుల వారికి నచ్చుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.