Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

|

Jun 03, 2021 | 7:07 PM

Weight Loss Tips: అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న శరీర బరువు ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది. పెరిగిన బరువును..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ చిట్కాలను పాటించండి..
Wieght Loss
Follow us on

Weight Loss Tips: అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న శరీర బరువు ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. పెరుగుతున్న వయస్సుతో పాటు శరీరంలో జీర్ణ శక్తి తగ్గడం ప్రారంభంకావడంతో.. పొట్ట చుట్టూ కొవ్వు పదార్థాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా శరీరాకృతిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో చాలా మందిలో హార్మోన్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయాన్ని చూసుకున్నట్లయితే.. చాలా మంది 40 ఏళ్ల వయసులో ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. అయితే ఆ బరువును తగ్గించుకోలేమని అపోహ చాలామందిలో ఉండిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడంపై దృష్టి సారించడం లేదు. అయితే, ఇలా గుడ్డిగా ఫిక్స్ అవడం కరెక్ట్ కాదు. మనస్ఫూర్తిగా అనుకోవాలనే కానీ.. 40 సంవత్సరాల వయస్సులోనూ బరువు తగ్గొచ్చు. మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? బరువు తగ్గించుకునే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారం తినండి..
వయసు పెరగడంతో శరీరంలో కండర శక్తి 3 నుంచి 8 శాతం మేర తగ్గుతుంది. 60 సంవత్సరాల వయస్సులో కండరాల బరువు మరింత వేగంగా తగ్గడం ప్రారంభం అవుతుంది. అయితే, కేలరీలు బర్నింగ్ చేయడంలో కండరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కండర శక్తి తగ్గితే బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే మీ ఆహారంలో అధిక మొత్తంలో ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ఇది శరీరం కండర శక్తిని పెంచుతుంది. అలాగే కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. ప్రోటీన్స్ అధికంగా ఉండే గుడ్లు, బీన్స్, మాంసం, పప్పుధాన్యాలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్ తినండి..
మీకు స్వీట్స్ నచ్చితే డార్క్ చాక్లెట్ తినవచ్చు. డార్క్ చాక్లెట్‌లో జింక్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు.. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది. అందుకే డార్క్ చాక్లెట్‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే మంచింది.

డైటింగ్ మానుకోండి..
బరువు తగ్గడానికి ఎటువంటి డైట్ పాటించాల్సిన అవసరం లేదు. డైట్ మేయింటెన్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ఏదైనా డైట్ మేయింటేన్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. పోషకాహరం తీసుకునే ముందు మీకు కేవలం కేలరీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను వీలైనంత వరకు మానుకోవాలి.

క్రమం తప్పని వ్యాయామం..
బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్యకరమైన జీవితానికి నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సులభమైన, ఉత్తమమైన వ్యాయామం నడక. ప్రతిరోజూ నడక కోసం వెళ్ళే వ్యక్తులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం చాలా తక్కువ. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కావున ప్రతి రోజు 35 నుండి 40 నిమిషాలు నడవడం కానీ, ఇతర వ్యాయామం చేయడం ఉత్తమం.

ప్రతిరోజూ గుడ్లు తినండి..
గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. గుడ్లు ఉత్తమమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. గుడ్లలో కేలరీలు తక్కువగా ఉండి, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి.

Also read:

వేడుకగా పెళ్లి.. వేదికపై వధువు చేసిన పనితో బిత్తరపోయిన వరుడు.. షాకింగ్ వీడియో