
మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ఎక్కువగా బిర్యానీ, పులావ్, నాన్ వెజ్ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయ ఉపయోగంతో ఆ వంటకం రుచే మారిపోతుంది. సువాసనతో రుచిగా తయారవుతుంది. పూర్వం నుంచి వంటల్లో జాజికాయను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా జాజికాయను ఎన్నో వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయ ఆరోగ్యకరమైన లాభాలు తెలుసుకున్న కారణంగా.. ఈ మధ్య జాజికాయను స్మూతీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. జాజికాయ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా శీతా కాలంలో జాజికాయను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
జాజికాయను ప్రతి రోజూ ఆహారంలో ఉపయోగించడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. మల బద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
ప్రతి రోజూ జాజికాయను తీసుకోవడం వల్ల మెదడు పని తీరు చురుగ్గా, సక్రమంగా పని చేస్తుంది. మతి మరుపు సమస్యతో ఇబ్బంది పడే వారు జాజికాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెదడును యాక్టీవ్ చేసే గుణాలు జాజికాయలో ఉన్నాయి. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. జాజికాయ పొడిని స్మూతీల్లో కలుపుకుని తాగొచ్చు.
నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలల్లో కూడా కలుపుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
చాలా మంది కీళ్ల, మోకాళ్ల నొప్పులు, వాపుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి కాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అలాంటి వారు జాజికాయను తీసుకోవడం వల్ల రిలీఫ్ నెస్ పొందొచ్చు. జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ కారణంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు)