సమస్త ఔషధాలకు నిలయం మన వంటిల్లు. వంటింట్లో ఉండే ప్రతి ఆహార పదార్థంతో మనం ఎదుర్కొనే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వాటిలో మెంతులు కూడా ఉన్నాయి. మెంతులు నానబెట్టి తిన్నా, మెంతులు నానబెట్టిన నీటిని తాగినా షుగర్ తగ్గుతుందన్న విషయం తెలిసిందే. జుట్టు సంబంధిత సమస్యలకు కూడా మెంతులు చక్కని పరిష్కారం. మెంతుల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మనకు చక్కని ఆరోగ్యాన్ని అందిస్తాయి. మెంతుల పొడిని వంటల్లో కూడా వాడుతుంటాం.
మెంతులు, కాళోంజి విత్తనాలు (నల్ల జీలకర్ర) కలిపి తీసుకుంటే.. ఇంకా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక పోషకాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ఉదర సమస్యలు తగ్గుతాయి: మెంతులు – కాళోంజీ విత్తనాలను సమానంగా తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. పరగడుపునే ఈ నీటిని తాగితే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది: మెంతులు, కాళోంజి విత్తనాలను కలిపి తీసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ రెండింటినీ నానబెట్టిన నీరు తాగితే.. సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చు: షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ రెండూ.. మహా ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
అధిక బరువు ఉండదు: మెంతులు – కాళోంజీ విత్తనాలను కలిపి తీసుకుంటే.. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి.. బరువు తగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యం: చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ రెండింటినీ దోరగా వేయించి విడివిడిగా పొడిచేసి.. పరగడుపున అర టీ స్పూన్ మోతాదులో 1 గ్లాసు వేడినీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
ఇలా మెంతులు, కాళోంజి విత్తనాలు (నల్లజీలకర్ర) వల్ల ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి కూడా సహాయపడుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి