పుల్కా అనేది భారతీయ ఆహారంలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థం. ఈ మధ్యకాలంలో చాలా మంది రెండో పూట పుల్కాలనే తింటున్నారు. సాధారణంగా ఇది మొదట పెనంపై సగం కాల్చి తరువాత గ్యాస్ పొయ్యిపై ప్రత్యక్ష మంటపై పూర్తిగా కాలుస్తారు. అయితే పుల్కా ని వండే ఈ పద్ధతి సురక్షితమైంది కాదని, ఇటీవల కొన్ని అధ్యయనాలు వెలువడిన తర్వాత ఈ ప్రశ్న తలెత్తడం ప్రారంభమైంది.
ఈ అధ్యయనాల్లో పుల్కాలను అధిక-ఉష్ణోగ్రత నేరుగా పొయ్యిపై కాల్చితే హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు), పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లు (PHAలు) విడుదలకు దారితీస్తాయని సూచిస్తున్నారు, వీటిని క్యాన్సర్ కారకాలుగా కూడా పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో,పుల్కా ని ఎలా కాల్చాలో తెలుసుకుందాం.
జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, సహజ వాయువు స్టవ్‌లు, కుక్‌టాప్‌లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను విడుదల చేస్తాయి, ఇవి శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతాయని WHO పరిగణించింది. ఇవి కార్డియోవాస్కులర్ సమస్యలతో పాటు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సంబంధిత వ్యాధులకు కారణమయ్యే పదార్థాలు.
ఇది మాత్రమే కాదు, న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ అనే పేరుతో ఒక అధ్యయనం కూడా పత్రికలో ప్రచురించబడింది, దీనిలో అధిక ఉష్ణోగ్రత వద్ద పుల్కాను కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. దీని కారణంగా పుల్కా ని నేరుగా గ్యాస్‌పై వండాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. పూర్వం ప్రజలు చపాతీ లేదా పుల్కా ని కట్టెల పొయ్యిపై గుడ్డతో నొక్కుతూ నేరుగా మంటలోకి పడకుండా కాల్చేవారు. కానీ పటకారు కనిపెట్టినప్పటి నుండి, ప్రజలు నేరుగా మంటల్లోనే పుల్కా ని వండడం ప్రారంభించారు.
ఈ పద్ధతి సులభంగా, తక్కువ సమయం తీసుకుంటుంది. పుల్కా ని అన్ని మూలల నుండి కాల్చాలి కాబట్టి ఇది ఉత్తమమైన మార్గంగా చూస్తున్నారు. ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చీఫ్ సైంటిస్ట్ ప్రచురించిన ఒక నివేదికలో, డాక్టర్. పాల్ బ్రెంట్ మాట్లాడుతూ, గోధుమ రొట్టె నేరుగా గ్యాస్ జ్వాలతో తాకినప్పుడు, అది చక్కెర , కొంత అమైనో మిశ్రమం అయిన అక్రిలమైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వేడి చేయడం వల్ల ఏర్పడుతుంది. కాలిన టోస్ట్ ఉన్నప్పటికీ, గోధుమ పిండిలో కొంత మొత్తంలో చక్కెరలు కూడా ఉంటాయి. ఇవి నేరుగా గ్యాస్ మంటపై కాల్చినప్పుడు, అది క్యాన్సర్ కారక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అందుకే పుల్కాలను నేరుగా మంటపై ఇలా కాల్చడం మానవ శరీరానికి పూర్తిగా సురక్షితం కాదు.
నేరుగా పొయ్యిపై కాల్చిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది:
అధ్యయనం ప్రకారం, గొడ్డు మాంసం, పంది మాంసం, చేపలు, కోడి మాంసంతో కూడిన మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించడానికి పాన్‌లో వండుకోవాలి. కానీ నేరుగా నిప్పు మీద కాల్చినప్పుడు, అది క్యాన్సర్ కారక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక పరిశోధనా పత్రం ప్రకారం, 100 మంది క్యాన్సర్ రోగుల్లో 79 శాతం మంది బార్బిక్యూ పై కాల్చిన మాంసం తినడం వల్ల కాన్సర్ బారిన పడ్డారని తేల్చారు. అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తే, మనం నేరుగా గ్యాస్‌తో చేసిన పుల్కా ని తినడం సురక్షితం కాదు. అయితే మంటపై నేరుగా వండిన పుల్కా క్యాన్సర్‌ను కలిగిస్తుందో లేదో నమ్మడానికి ఇంకా మరిన్ని అధ్యయనాలు అవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..