Guava: రోజుకో జామపండు తింటే.. ఇన్ని ఉపయోగాలా!!

|

Jul 24, 2023 | 4:49 PM

వర్షాకాలం.. ఈ సీజన్ లో ఎక్కువగా లభించే పండ్లు జామపండ్లు. పల్లెటూళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటికో జామచెట్టు ఉంటుంది. జామకాయ ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇటీవలకాలంలో చాలామంది ప్రధానంగా ఎదుర్కొంటున్న..

Guava: రోజుకో జామపండు తింటే.. ఇన్ని ఉపయోగాలా!!
Guava
Follow us on

వర్షాకాలం.. ఈ సీజన్ లో ఎక్కువగా లభించే పండ్లు జామపండ్లు. పల్లెటూళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటికో జామచెట్టు ఉంటుంది. జామకాయ ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇటీవలకాలంలో చాలామంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు గుండెజబ్బులే. చిన్న, పెద్దల్లో వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అదే రోజుకొక జామకాయ తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

జామపండులో ఉండే ఫైబర్, పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేయడంలో దోహదపడుతాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు వివిధ చర్మసంబంధిత సమస్యల నుంచి కాపాడటంతో పాటు.. లోపలి నుంచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలను జామకాయలోని ఔషధ గుణాలు నివారిస్తాయి. ఉసిరిలో కంటే జామపండులోనే విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇది కంటిచూపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు.. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండును తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కానీ.. పూర్తిగా పండిన జామకాయ కాకుండా.. ఓ మాదిరిగా ఉన్న కాయలనే తినడం మేలు.

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే మూడ్ స్వింగ్స్ ను కూడా జామకాయ కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది. పంటినొప్పి, నోటి అల్సర్ లను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ మంచి ఆహారం. వీటిలో కొవ్వును పెంచే గుణాలు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైట్ చేసేవారు ఎలాంటి అనుమానం లేకుండా జామకాయను కూడా తమ రెగ్యులర్ డైట్ లో తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..