Asthma Symptoms: పొడి దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే అజాగ్రత్తగా ఉండకండి.. ఎందుకంటే..

మీకు ఎప్పుడు పొడి దగ్గు వస్తుంటే దాని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఉబ్బసం యొక్క ప్రారంభ లక్షణం కావచ్చు. కొన్నిసార్లు పొడి దగ్గు ఊపిరితిత్తులలో మంటను కలిగిస్తుంది. ఇది అనేక సమస్యలను మూలం అవుతుంది...

Asthma Symptoms: పొడి దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే అజాగ్రత్తగా ఉండకండి.. ఎందుకంటే..
Cohth
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 10, 2021 | 10:33 PM

మీకు ఎప్పుడు పొడి దగ్గు వస్తుంటే దాని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఉబ్బసం యొక్క ప్రారంభ లక్షణం కావచ్చు. కొన్నిసార్లు పొడి దగ్గు ఊపిరితిత్తులలో మంటను కలిగిస్తుంది. ఇది అనేక సమస్యలను మూలం అవుతుంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో దుమ్ము, కాలుష్యం వల్ల చాలా మందికి పొడి దగ్గు వస్తోందని పల్మనాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కుమార్ చెబుతున్నారు. ఇది చాలా కాలం పాటు కొనసాగితే, ఆస్తమా అభివృద్ధి చెందే ప్రమాదం కూడా పెరుగుతుందని చెప్పారు. ఆస్తమా ప్రధానంగా కుటుంబ, జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. నిరంతర దగ్గు దాని ప్రారంభ లక్షణంగా చెబుతారు. దగ్గుతోపాటు శ్వాసలో గురకతో బాధపడుతుంటే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఇవి కూడా ఆస్తమా యొక్క లక్షణాలని గుర్తించాలి. చలిలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. N-95 మాస్క్ ధరించాలని చెబుతున్నారు. దగ్గుతో పాటు తెమడ వస్తున్నా లేదా ఛాతీలో నొప్పి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ప్రపంచంలో 300 మిలియన్ల మందికి ఆస్తమా ఉంది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ఆస్తమా నివేదిక ప్రకారం ప్రపంచంలో దాదాపు 300 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. చాలా మందిలో దీని లక్షణాలు చిన్నతనంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. గత కొన్నేళ్లుగా ఆస్తమా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నాసిరకం జీవనశైలి, చెడిపోతున్న వాతావరణమే ఈ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

Read Also.. చలికాలంలో గుండుపోటుకు ఇదేకారణం ! తస్మాత్‌ జాగ్రత్త !! వీడియో