Women Health: మహిళలు ఇవి చేస్తే గుండె జబ్బుల బారిన పడరు.. ఎందుకంటే..?

|

Mar 14, 2022 | 6:15 AM

Women Health: ప్రస్తుత కాలంలో పురుషుల మాదిరి స్త్రీలు కూడా గుండెజబ్బులని ఎదుర్కొంటున్నారు. మధుమేహం, అధిక బరువు ఉన్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంది.

Women Health: మహిళలు ఇవి చేస్తే గుండె జబ్బుల బారిన పడరు.. ఎందుకంటే..?
Women Health
Follow us on

Women Health: ప్రస్తుత కాలంలో పురుషుల మాదిరి స్త్రీలు కూడా గుండెజబ్బులని ఎదుర్కొంటున్నారు. మధుమేహం, అధిక బరువు ఉన్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటిని నివారించాలంటే స్త్రీలు కచ్చితంగా కొన్ని చిట్కాలని పాటించాలి. వారానికి ఐదు రోజుల పాటు 45 నిమిషాల చొప్పున వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఇందులో వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ ఉండాలి. మహిళలు గుండెకి సంబంధించిన డైట్‌ ఫాలో అవ్వాలి. తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు, ఫైబర్‌ పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి. కొవ్వు ఆహారాలు, చక్కెర పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్‌ను నివారించాలి. మీరు ఇప్పటికే గుండె రోగి అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడు సూచంచిన మందులను వాడాలి. అప్పుడే గుండెపోటుకి దూరంగా ఉంటారు.

ఒత్తిడి అనేది దురదృష్టవశాత్తు కొలవలేని ఒక ప్రమాద కారకం. ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అందుకే యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. నోటి గర్భనిరోధక మాత్రలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి వాడటం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధింత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇప్పుడు అధిక బరువు లేదా ఊబకాయం ఒక ప్రధాన కారకంగా మారింది. బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ లేదా నడుము పరిమాణం 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే ఏ స్త్రీ అయినా గుండె జబ్బులకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ వ్యాయామం, కఠినమైన ఆహార నియంత్రణ మీ శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతాయి.

Viral Video: అబ్బ.. మంచి విందు భోజనం దొరికిందిరా.. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్‌..!

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..