Health Tips: వేడి, తేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి.. నిపుణులు ఏమంటున్నారంటే..?

|

Jul 04, 2022 | 9:59 PM

డాక్టర్ సురంజిత్ ఛటర్జీ మాట్లాడుతూ.. ఎండ, వర్షాల కారణంగా ఈ నెలలో చాలా తేమ ఉంటుందని.. ప్రజలు చెమటతో ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఇది చర్మం, కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సీజన్‌లో కనిపించే కొన్ని సాధారణ కంటి ఇన్ఫెక్షన్‌లలో స్టై, కండ్లకలక ఉన్నాయి.

Health Tips: వేడి, తేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Monsoon Season
Follow us on

Humidity steadily rise in temperature: వేసవి కాలంలో ఎండలు బాగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. తీవ్రమైన వేడి తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యుమిడిటీ పెరిగినప్పుడు పలు చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు. దీనిపై.. అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ ఛటర్జీ మాట్లాడుతూ.. ఎండ, వర్షాల కారణంగా ఈ నెలలో చాలా తేమ ఉంటుందని.. ప్రజలు చెమటతో ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఇది చర్మం, కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సీజన్‌లో కనిపించే కొన్ని సాధారణ కంటి ఇన్ఫెక్షన్‌లలో స్టై, కండ్లకలక ఉన్నాయి. తామర, గజ్జి, మొటిమలు, చర్మ అలెర్జీలు అత్యంత సాధారణ రుతుపవన ఇన్ఫెక్షన్లని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ & హెచ్‌ఓడి డాక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తేమ వలన ఇబ్బందులు పెరుగుతాయన్నారు. ఇది అసౌకర్య భావనతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. మనకు చెమట పట్టుతుంది.. చెమట అంత తేలికగా ఆవిరైపోదు. ఇది ఎక్కువ అసౌకర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అధిక తేమ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఈ ఆరోగ్య సమస్యలను ఇలా నివారించండి..

ఇవి కూడా చదవండి

నీరు ఎక్కువగా తాగాలి: ప్రతిరోజూ తాగవలసిన నీటి పరిమాణం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే భోజనం, భోజనం మధ్య నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. వేడిగా, తేమగా ఉండే వాతావరణం వల్ల ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. అందుకే ద్రవాలను భర్తీ చేయడానికి నీటి శాతాన్ని ఎక్కుగా పెంచాలి.

సలాడ్లు – తాజా పండ్ల వంటి ఆహారాలు తినండి: వేడిగా, తేమగా ఉన్నప్పుడు వేడి ఆహారాలు తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వంట చేస్తున్నట్లయితే ఇల్లు కూడా వేడిగా ఉంటుంది. బదులుగా తాజా కూరగాయలను కడిగి, సలాడ్ తయారు చేసుకోండి. తాజా పండ్లతో చిరుతిండి తినండి.. ఆరుబయట ఎక్కువగా గడపండి.. శాండ్‌విచ్ లేదా మాంసం పదార్థాలు, చీజ్ లాంటివి తినండి.

చల్లటి నీటితో స్నానం చేయండి: చల్లటి నీటితో స్నానం చేయడం, ఈత కొట్టడం ప్రభావవంతమైన మార్గం. ఇంట్లో లేకుంటే, మెడ, నుదిటి చల్లటి నీటిని చల్లి ఉపశమనం పొందవచ్చు.

వదులుగా, తేమను తగ్గించే దుస్తులను ధరించండి: వేడిగా, తేమగా ఉండే రోజులలో లేత రంగులలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, రేయాన్ లేదా స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లను నివారించండి. పాదాలను చల్లగా ఉంచడానికి చెప్పులు లేదా కాన్వాస్ షూలతో బయటకు వెళ్లండి.

కాటన్ షీట్లతో నిద్రించండి: మీ బెడ్ షీట్‌లు ఉన్ని కాకుండా కాటన్ వంటి తేలికపాటి వస్త్రంతో తయారు చేసిన వాటిని ఉపయోగించండి.. కాటన్ షీట్‌లు సులభంగా ఉంటాయి. రాత్రిపూట చల్లగా ఉండేలా చేస్తాయి. వేడి, తేమతో కూడిన వాతావరణంలో మరింత సౌకర్యవంతమైన నిద్రను అందిస్తాయి.

వేడి, తేమకు అలవాటుపడండి: కొంతకాలంపాటు వేడిగా, తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటారని తెలిస్తే.. ఇలాంటి వాతావరణానికి అలవాటుపడాలి. ఇలా చేయడం వల్ల ముందస్తుగా శరీరం అలవాటుపడుతుంది. ప్రారంభంలో కొంత అసౌకర్యంగా ఉన్నా.. ఆ తర్వాత సాధారణమవుతుంది.

హీట్ స్ట్రోక్: తేమగా ఉండే వాతావరణం మిమ్మల్ని హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్‌కు (ఎండదెబ్బ) గురి చేస్తుంది. ప్రత్యేకించి మీరు తీవ్రంగా వ్యాయామం చేస్తుంటే.. పుష్కలంగా నీరు తాగడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండటానికి పలు చర్యలు తీసుకోవడం మంచిది.

సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్- టోపీలను ఉపయోగించండి: ఎండ వేడికి గురికాకుండా ఉండటానికి శరీరాన్ని చల్లబరిచే వాటిని ఉపయోగించాలి. సన్‌స్క్రీన్‌తో పాటు వెడల్పు అంచులు ఉన్న టోపీ, సన్‌గ్లాసెస్ వంటి వాటిని ధరించండి.

కఠినమైన బహిరంగ వ్యాయామం మానుకోండి: వేడి, తేమతో కూడిన వాతావరణంలో తీవ్రమైన వ్యాయామం అసౌకర్యంగా ఉండటమే కాకుండా ప్రమాదకరమైనది కూడా. వేగంగా శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. కండరాల తిమ్మిరి, వేడి, అలసట, హీట్‌స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అధిక వేడి, తేమలో పరుగెత్తడం లేదా క్రీడలు ఆడటం వంటి తీవ్రమైన వ్యాయామాలను నివారించండి.

Source Link

హెల్త్ వార్తల కోసం