Teeth Whitening: దుర్వాసనకు చెక్ పెట్టి.. దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలంటే ఇలా చేయండి..

|

Oct 05, 2022 | 9:01 PM

అందంగా కనిపించాలంటే.. ముఖంతోపాటు దంతాలు కూడా మెరవాల్సిందే. అయితే.. దంతాలు పసుపు రంగులోకి మారడం, నోటి దుర్వాసన కారణంగా చాలామంది తరచుగా ఇబ్బంది పడుతూ కనిపిస్తారు.

Teeth Whitening: దుర్వాసనకు చెక్ పెట్టి.. దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలంటే ఇలా చేయండి..
Teeth Problems
Follow us on

అందంగా కనిపించాలంటే.. ముఖంతోపాటు దంతాలు కూడా మెరవాల్సిందే. అయితే.. దంతాలు పసుపు రంగులోకి మారడం, నోటి దుర్వాసన కారణంగా చాలామంది తరచుగా ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. ఈ సమస్య కారణంగా అలాంటి వారు ఎదుటివారి ముందు మాట్లాడటానికి, నవ్వడానికి వెనుకాడతారు. రోజూ బ్రష్ చేస్తున్నా దంతాలు మెరిసిపోవడం లేదని, నోటి దుర్వాసన వస్తోందని కొందరు తరచూ వాపోతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. కొన్ని హోం రెమెడీస్ ద్వారా దంతాలను మెరిసేలా చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బేకింగ్ సోడాతో పసుపు పళ్ళకు చెక్ పెట్టొచ్చు..

దంతాలను ముత్యాల్లా మెరిసేలా చేయడానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. దీని కోసం, చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకోని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో అప్లై చేసి పళ్లను తేలికగా శుభ్రం చేసుకోవాలి. దీంతో దంతాలు దృఢంగా మారడంతోపాటు తెల్లగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

వెనిగర్‌తో దంతాలకు మెరుపు..

దంతాలను పాలిష్ చేయడంతో పాటు నోటి దుర్వాసనను తొలగించుకోవాలంటే వైట్ వెనిగర్ మంచి ఎంపికని సూచిస్తున్నారు. దీని కోసం, ఉదయం బ్రష్ చేసిన తర్వాత నీటిలో వెనిగర్ వేసుకొని.. నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు మెరుపు రావడమే కాకుండా నోటి దుర్వాసన కూడా పోతుంది.

స్ట్రాబెర్రీ – ఉప్పు పేస్ట్..

ఉప్పు, స్ట్రాబెర్రీలు దంతాలను శుభ్రపరచడానికి కూడా పని చేస్తాయి. ఇందుకోసం స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి చిటికెడు ఉప్పు కలిపి బ్రష్‌పై అప్లై చేసి దంతాలను శుభ్రం చేసుకోవాలి. దీంతో దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.

అల్లం, ఉప్పుతో నోటి దుర్వాసనకు చెక్..

నోటి దుర్వాసనను పోగొట్టడానికి అల్లం, ఉప్పును ఉపయోగించవచ్చు. దీని కోసం నీటిలో అల్లం, ఉప్పు వేసి వేడి చేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోయి దంతాలు పసుపు రంగులోకి మారడం కూడా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి