AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తహీనతకు అసలు కారణాలు ఇవే..! జాగ్రత్త పడలేదో అంతే సంగతి..!

రక్తహీనత చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. ఇది ఎక్కువగా మహిళలు, పిల్లలు, టీనేజర్లలో కనిపిస్తుంది. శరీరానికి అవసరమైన హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సరైన ఆహారపు అలవాట్లు, పోషక పదార్థాలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

రక్తహీనతకు అసలు కారణాలు ఇవే..! జాగ్రత్త పడలేదో అంతే సంగతి..!
Anemia Symtoms
Prashanthi V
|

Updated on: Jun 28, 2025 | 2:26 PM

Share

ఇతర ఆరోగ్య సమస్యలతో పోలిస్తే రక్తహీనత (Anemia) ఎక్కువ మందిలో కనిపించే ఒక మామూలు సమస్య. ఇది ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు, టీనేజ్‌ లో ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఇది శరీరంపై చాలా కాలం ప్రభావం చూపుతుంది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు (RBCs) తక్కువగా ఉన్నప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు.. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీని వల్ల అలసట, ఒత్తిడి, మూర్ఛ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్తహీనతకు గల కారణాలు

  • పోషకాహార లోపం (ఐరన్, విటమిన్ B12, ఫోలేట్ లోపాలు)
  • ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం
  • టీ, కాఫీ ఎక్కువగా తాగడం. ఇవి ఐరన్ శరీరం తీసుకోవడాన్ని అడ్డుకుంటాయి
  • కొన్ని మందుల ప్రభావం
  • నెలసరి వల్ల శరీరం రక్తాన్ని కోల్పోవడం

రక్తహీనత తగ్గించే ముఖ్యమైన ఆహారాలు

  • ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు
  • పాలకూర, కంద, బీట్‌ రూట్ లాంటివి
  • మటన్, కోడి గుడ్లు, చేపలు
  • చిక్కుళ్ళు, శెనగలు, మినుములు, బీన్స్
  • దానిమ్మ, ఖర్జూరాలు, ద్రాక్ష
  • పైవన్నీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

విటమిన్ సి.. ఐరన్ శోషణకు కీలకం

  • నిమ్మకాయ
  • నారింజ
  • ఉసిరికాయ
  • టమాటా
  • జామపండు
  • ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఫోలేట్ విటమిన్ B12.. వీటి లోపం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.

  • పాలకూర
  • గుడ్లు, పెరుగు, పాలు
  • మాంసం
  • చిక్కుళ్ళు, బీన్స్

టీ కాఫీ తక్కువగా తీసుకోండి.. టీ, కాఫీలో ఉండే టానిన్లు ఐరన్ శరీరం తీసుకోవడాన్ని ఆపేస్తాయి. భోజనం చేసేటప్పుడు లేదా తర్వాత వెంటనే టీ తాగడం మంచిది కాదు. కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వడం ఉత్తమం.

ఆరోగ్యకరమైన కొవ్వులు.. విటమిన్ A, E లాంటి కొవ్వులో కరిగే విటమిన్లు హిమోగ్లోబిన్ స్థాయిని సరిగ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని శరీరం గ్రహించడానికి కొవ్వు అవసరం.

  • బాదం, వాల్‌ నట్‌లు
  • చియా గింజలు
  • అవకాడోలు
  • సాల్మన్ చేపలు

నీరు బాగా తాగడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. అలాగే తృణధాన్యాలు కూడా రక్తహీనత రాకుండా బలం ఇస్తాయి.

రక్తహీనత సరైన ఆహారం ద్వారా దాదాపుగా నివారించగల ఆరోగ్య సమస్య. పోషకాలు సమతుల్యంగా ఉండే ఆహారం, నీరు, సరైన జీవనశైలి ద్వారా మనం ఈ సమస్యను తగ్గించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు