Diabetes: మీకు బ్లడ్ షుగర్ అదుపులో ఉండటం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

|

Nov 14, 2022 | 9:46 AM

ఒత్తిడి, చెడు జీవనశైలి కారణంగా మధుమేహం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధుమేహం అనే వ్యాధి ఇప్పుడు యువ తరంలోనూ కనిపిస్తోంది. మధుమేహాన్ని..

Diabetes: మీకు బ్లడ్ షుగర్ అదుపులో ఉండటం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
Diabetes
Follow us on

ఒత్తిడి, చెడు జీవనశైలి కారణంగా మధుమేహం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధుమేహం అనే వ్యాధి ఇప్పుడు యువ తరంలోనూ కనిపిస్తోంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం అనుకున్నంత సులభం కాదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, ఇతర కార్యకలాపాల వరకు అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచవచ్చు. అదే సమయంలో డయాబెటిక్ పేషెంట్లు వారి బ్లడ్ షుగర్ లెవల్స్‌ తగ్గకుండా, పెరగకుండా వారి దినచర్యను మార్చుకోవాల్సి ఉంటుంది. మధుమేహం పేషెండ్లు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

ఈ విధంగా రక్తంలో చక్కెరను నియంత్రించండి:

  1. రక్తంలో చక్కెరను తనిఖీ చేయండి: టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ ఉదయం ఆహారం తీసుకునే ముందు వారి రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. దీంతో వారి శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
  2. అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు: డయాబెటిస్‌లో ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. అందుకే ఎక్కడికైన వెళ్లినా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మర్చిపోకండి. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణించబడుతుందని గుర్తించుకోండి.
  3. పాదాల శ్రద్ధ వహించండి: మధుమేహం నేరుగా పాదాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల నరాల దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని వల్ల కాళ్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పాదాలపై దద్దుర్లు, వాపులు లేదా గడ్డలు ఏవైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
  4. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా ముఖ్యం. ఉదయం లేవగానే నీళ్లు తాగడంతోపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా నీళ్ల బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. డయాబెటిస్‌ వారు రోజంతా తగినంత నీరు తాగడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి