శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే కంటి నిండా నిద్రపోవాలని (Sleeping) అంటారు. చురుగ్గా ఉండేందుకు సమతులాహారంతో పాటు సరైన నిద్ర కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మనతో పాటూ రోజంతా కష్టపడిన అవయవాలు నిద్రపోయాకే సేదతీరుతాయి. నిద్ర అవసరాన్ని తెలిపేందుకు ప్రతి ఏడాది మార్చి మూడో శుక్రవారాన్ని ‘వరల్డ్ స్లీపింగ్ డే’ (World Sleeping Day) గా జరుపుకుంటున్నారు. నిద్ర అవసరంపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వరల్డ్ స్లీప్ సొసైటీకి (World Sleep Society) చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ- 2008 నుంచి స్లీపింగ్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిద్ర గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి నిద్రలేకుండా ఎన్ని రోజులు బతకగలడు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిని ఓ వ్యక్తి ప్రయోగం చేసి మరీ చూపించారు. 1965లో 17 ఏళ్ల విద్యార్థి రాండీ గార్డనర్.. సైన్స్ ఫెయిర్ కోసం నిద్రపోకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాదాపు 264 గంటలు అంటే 11 రోజులు నిద్రపోకుండా ఉన్నాడు. అంతకుమించి ఉంటే అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా మృత్యువు సంభవిస్తుంది.
Also Read