Tomato: షుగర్ ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు టమాటో తినకూడదా..? ఇదిగో క్లారిటీ

ఆహారంలో టమాటాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. LDL కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టమాటాల్లోని లైకోపీన్ అనే పదార్థం ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. అలానే వాటిల్లోని పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. టమాటాలో బీటా కెరోటిన్, లుటిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.

Tomato: షుగర్ ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు టమాటో తినకూడదా..? ఇదిగో క్లారిటీ
Tomoto

Updated on: Mar 16, 2024 | 2:52 PM

టమాటోలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అలానే విటమిన్ ఇ, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే రైతులు ఈ మధ్యకాలంలో కూరగాయలు, టమాటో పంటలకు ఎక్కువగా పురుగుమందులు వాడుతున్నారు. అందుకే వాటిని కట్ చేసేముందుు శుభ్రంగా కడగాలి. ఆర్గానిక్ టమాటోలు దొరికితే మరీ మంచిది. 100 గ్రాముల టమాటోలలో సుమారు 22 కేలరీలు, 4.8 గ్రా కార్బోహైడ్రేట్లు, 3.2 గ్రా చక్కెర, 1.1 గ్రా ప్రోటీన్, 0.2 గ్రా కొవ్వు, 1.5 గ్రా ఫైబర్ ఉంటాయి.

ఆహారంలో టమాటోలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. LDL కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టమాటోల్లోని లైకోపీన్ అనే పదార్థం ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. అలానే వాటిల్లోని పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. టమాటోలో బీటా కెరోటిన్, లుటిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా, టమాటోలో విటమిన్లు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమాటాలోని లైకోపీన్ అనే పదార్ధం UV వంటి హానికరమైన కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

షుగర్ ఉన్నవారు టమాటోలు తినవచ్చా?

టమాటోలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. కానీ వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మర్చిపోవద్దు.

గర్భిణీ స్త్రీలు టమాటాలు తినవచ్చా?

టమాటోలో ఫోలేట్ ఉంటుంది. పిండ నాడీ ట్యూబ్ అభివృద్ధికి ఇది చాలా అవసరం. వీటిలోని విటమిన్ సి, పొటాషియం తల్లి, బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

కొంతమందికి టమాటో అంటే ఎలర్జీ వస్తంది. చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. టమాటోలో మాలిక్, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. టమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి. అయితే టమాటో తింటే బరువు పెరుగుతారని కొందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదు.

టమాటోలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పచ్చి టమాటోలు ఉడికించిన వాటి కంటే మంచివి. వాటిని వండకుండా పచ్చిగా తినడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. టమాటోలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ కూడా ఉంది. టమాటోలో ఆక్సలేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మితంగా తింటే ఎలాంటి రోగాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..