ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

|

Dec 03, 2020 | 7:47 AM

పేరు మోసిన  సూపర్ మార్కెట్‌కు వెళ్లి మంచి బ్రాండున్న హనీ బాటిల్ పర్చేజ్ చేస్తున్నారా..అది ఒరిజినల్ అని ఫీలవుతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే...

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి
Follow us on

పేరు మోసిన  సూపర్ మార్కెట్‌కు వెళ్లి మంచి బ్రాండున్న హనీ బాటిల్ పర్చేజ్ చేస్తున్నారా..అది ఒరిజినల్ అని ఫీలవుతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. భారత్‌లో వివిధ బ్రాండ్ల పేరిట విక్రయమవుతోన్న తేనెల కల్తీ అవుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్ వెల్లడించింది.  ఇండియాలోని 13  పేరుమోసిన, సాధారణ బ్రాండ్లకు సంబంధించిన తేనెల క్వాలిటీని సీఎస్‌ఈ ఆహార పరిశోధకులు పరిశీలించారు. మొత్తం 22 నమూనాలను టెస్ట్ చేయగా… 77 శాతం తేనెలు పంచదార పాకంతో కల్తీ చేస్తున్నట్లు వారు గుర్తించారు. కేవలం ఐదు బ్రాండ్లు మాత్రమే అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయని వారు తెలిపారు.

అయితే తొలుత ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌లోని పశువుల ఆహార, అభ్యసన కేంద్రం (సీఏఎల్‌ఎఫ్‌), కర్ణాటకలోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)లో టెస్ట్ చేయగా… అన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు రిజల్ట్స్ వచ్చాయన్నారు. కానీ వాటిని జర్మనీలోని ఓ స్పెషల్ ల్యాబ్‌లో న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసొనెన్స్‌(ఎన్‌ఎమ్‌ఆర్‌) టెస్ట్ చేయించగా అవన్నీ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆ ఫలితాల్లో వెల్లడైందని వివరించారు.  దేశంలో నిర్దేశించిన అన్ని పరీక్షలకు పట్టుబడకుండా తేనెను కల్తీ చేస్తున్నారన్న విషయం తెలిసి పరిశోధకులు షాక్‌కు గురయ్యారట.

ఇక  చైనాకు చెందిన అనేక కల్తీ ఫ్రక్టోజ్‌ సిరప్‌లు ఇండియాకు ఎక్స్‌పోర్ట్ అయినట్లు సీఎస్‌ఈ ప్రతినిధులు వివరించారు. తేనెలో 50 నుంచి 80 పర్సెంట్ కల్తీ జరిగినా అది టెస్టుల్లో గుర్తించలేమని సీఎస్‌ఈ జనరల్‌ డైరక్టర్‌ సునితా నరైన్‌ వెల్లడించారు. కరోనా కాలంలో ప్రజలు తేనెను ఎక్కువగా వినియోగించారని..అది ఆరోగ్యానికి బలం చేకూర్చకపోగా, మరింత అనారోగ్యం దిశగా తీసుకెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో నూతన టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ కల్తీ వ్యాపారాన్ని అదుపుచేయగలమన్నారు.

Also Read : మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !