Honey
ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతుంటే.. బరువు తగ్గించడంలో సహాయపడే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. దీనికోసం ఆయుర్వేదంలో చాలా హోం రెమెడీస్ ఉన్నాయి. వాటి సహాయంతో మీరు ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. వీటిలో ఒకటి తేనె. తేనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారంలో తేనెను చేర్చుకోవడం వల్ల శరీరం చాలా త్వరగా రూపు సంతరించుకుంటుంది. తేనెలో కొన్ని పదార్థాలు కలిపి తినడం వల్ల క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. తేనె ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతుంది. బరువు తగ్గాలంటే తేనెలో ఏం కలుపుకుని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనెను వీటితో కలిపి తీసుకుంటే.. బరువు తగ్గిపోతుంది..
- తేనె – నిమ్మకాయ: తేనె – నిమ్మ బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన ఇంటి నివారణలు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ, 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి. నిమ్మకాయ మీకు ఇష్టం లేకపోతే తేనె – వెచ్చని నీటిని తీసుకోవచ్చు.
- తేనెతో వెల్లుల్లి: ఊబకాయం తగ్గాలంటే వెల్లుల్లిని తేనెతో కలిపి తినండి. ప్రతిరోజూ ఉదయం 2-3 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల తేనె కలిపి తినడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. మీకు కావాలంటే వెల్లుల్లిని పేస్ట్‌గా చేసి, 2 టీస్పూన్ల తేనెను మిక్స్ చేసి గోరువెచ్చని నీటితో తాగవచ్చు. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
- తేనె – పాలు: పాలలో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలు మరిగించిన తర్వాత మాత్రమే దానికి తేనె కలపాలని గుర్తుంచుకోండి. 1 గ్లాసు పాలలో 2 టీస్పూన్ల తేనె కలుపుకుని తాగాలి. దీంతో పాలు తియ్యగా మారడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.
- బ్రౌన్ బ్రెడ్‌ను తేనెతో కలిపి తినండి: మీకు బాగా ఆకలిగా అనిపించినా లేదా ఉదయాన్నే ఏదైనా తినాలనిపిస్తే మీరు బ్రౌన్ బ్రెడ్‌పై తేనెను అప్లై చేసుకుని తినవచ్చు. మీరు దీన్ని అల్పాహారం లేదా రాత్రి భోజనంలో కూడా తినవచ్చు. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గుతుంది.
- తేనె – మజ్జిగ: బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మీరు మజ్జిగ కూడా తాగవచ్చు. కావాలంటే మామూలు మజ్జిగలో తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. 1 గ్లాసు మజ్జిగలో 2 టీస్పూన్ల తేనె కలుపుకుని తాగాలి. దీంతో పొట్ట కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి