దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే

|

Aug 04, 2021 | 9:58 AM

ఏసీల్లో పనిచేసేవారు, ఎండలో తిరగాలంటే రెండురకాల వాతావరణానికి హార్మోన్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఇక నిద్ర లేమి కూడా చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
Health Tips For Rahes
Follow us on

రోజు కి రోజుకి పెరుగుతున్న వాయుకాలుష్యం .. దీని ప్రభావం చర్మంపై పడుతుంది. చర్మం ముడుతలు పడడం, ఒంటి నిండా మచ్చలు రావడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఏసీల్లో పనిచేసేవారు, ఎండలో తిరగాలంటే రెండురకాల వాతావరణానికి హార్మోన్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఇక నిద్ర లేమి కూడా చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకొక్కసారి దురద, దద్దుర్లు, వంటి సాధారణ చర్మ సమస్యలు ఏర్పడి.. ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి సమస్యలకు ఆయుర్వేదంలోని ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు

* వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాసుకుంటే.. సాధారణ చర్మరోగాలకు చెక్ పెట్టవచ్చు
* వేపచెట్టు బెరడు కషాయం తాగినా చర్మ వ్యాధులు తగ్గుతాయి.
* మెట్టతామర ఆకు పసరు, నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని దురద దద్దుర్లు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే చర్మానికి అప్లై చేసినా వ్యాధి నయం అవుతుంది.
* మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసినా చర్మరోగాలు తగ్గుతాయి.
* నల్ల ఉమ్మెత్త రసం రాసినా చర్మరోగాలు తగ్గిపోతాయి.
* కొబ్బరినూనెలో గంధం పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని పూసినా చర్మరోగాలు పూర్తిగా నయం అవుతాయి.
* ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలాన్ని అప్లై చేసినా చర్మరోగాలు నయమవుతాయి.
* కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలకు చెక్ పెట్టవచ్చు
* జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాసినా చర్మరోగాలు తగ్గుతాయి.
* నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మానికి అప్లై చేసినా చర్మరోగాలు తగ్గుతాయి.
* పనస చెట్టు ఆకులు నూరి ఆ పేస్ట్ చర్మానికి అప్లై చేసినా ఎన్నో చర్మ వ్యాధులకు ఒకటే మెడిసిన్ గా పనిచేస్తుంది.
* దురదతో ఉండే చీముపొక్కులుతో ఇబ్బంది పడేవారు తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఈ చిట్కాల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే.. దానిని ఉపయోగించి సాధారణ చర్మవ్యాధులు నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు తగినంత నిద్ర, మంచి ఆహారం కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు.

Also Read: తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యం.. పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది..!:Motherfeed video.

Health Tips: బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు బెస్ట్..! వ్యాధులు కూడా దూరం.. తెలుసుకోండి

Weight Loss : బరువు తగ్గడానికి చిన్నప్పటి గేమ్ సూపర్‌గా పనిచేస్తుంది..! కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి..