Foot Pain: అరికాళ్లలో నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి!!

|

Sep 09, 2023 | 3:37 PM

ఎక్కువ సేపు పని చేసినా లేదా నిలుచున్నా చాలా మందికి అరికాళ్లలో నొప్పులు వస్తూంటాయి. అధిక బరువు ఉన్నా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం అరి కాళ్లపై పడుతుంది. చాలా మందికి ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ముక్యంగా మహిళలకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తూంటాయి. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా అటూ ఇటూ తిరుగుతూ, వంట చేస్తూ, పని చేస్తూ ఉంటారు కాబట్టి. అరికాళ్లలో నొప్పికి సంబంధించిన వ్యాధిని ప్లాంటర్ ఫసిటిస్ అనే పిలుస్తారు. అయితే కొంత మందిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఇలా నొప్పి వస్తూనే..

Foot Pain: అరికాళ్లలో నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి!!
Feet Pain
Follow us on

ఎక్కువ సేపు పని చేసినా లేదా నిలుచున్నా చాలా మందికి అరికాళ్లలో నొప్పులు వస్తూంటాయి. అధిక బరువు ఉన్నా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం అరి కాళ్లపై పడుతుంది. చాలా మందికి ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ముక్యంగా మహిళలకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తూంటాయి. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా అటూ ఇటూ తిరుగుతూ, వంట చేస్తూ, పని చేస్తూ ఉంటారు కాబట్టి. అరికాళ్లలో నొప్పికి సంబంధించిన వ్యాధిని ప్లాంటర్ ఫసిటిస్ అనే పిలుస్తారు. అయితే కొంత మందిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఇలా నొప్పి వస్తూనే ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి కూడా మన ఇంటి చిట్కాలు ఉపయోగించుకోవచ్చు. వీటి వల్ల పూర్తి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలు ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీటితో ఇలా చేయండి:

అరికాళ్లలో నొప్పి వస్తుంటే.. రాత్రి పడుకునే ముందు లేదా ఎప్పుడైనా ఓ వాటర్ బాటిల్ లో ఒక మాదిరి వేడిగా ఉన్న నీళ్లు పోయాలి. ఆ బాటిల్ ను అరికాళ్ల మీద ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చేస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

కాల్చిన ఇటుకతో ఉపశమనం:

అరికాళ్లలో నొప్పులు తగ్గాలంటే ఇటుకను బాగా కాల్చి దాని మీద ఒక జిల్లేడు ఆకును ఉంచాలి. ఆ తర్వాత మడమతో గట్టిగా తొక్కాలి. ఇలా చేస్తే అరికాళ్ల నొప్పులు మాత్రమే కాకుండా.. మడల నొప్పులు కూడా పొతాయి.

ఐస్:

ఐస్ తో కూడా అరికాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. గడ్డ కట్టిన ఐస్ గడ్డని ఒక గుడ్డలో ఉంచి అరికాళ్ల మీద, మడమల మీద ఉంచి దానితో రుద్దుతూ మసాజ్ చేస్తే నొప్పి కంట్రోల్ లోకి వస్తుంది.

పసుపు-ఉప్పు:

పసుపు సర్వరోగ నివారిణి. పసుపుతో ఎలాంటి వ్యాధులకైనా చెక్ పెట్టవచ్చు. ఒక బకెట్ లో సగం వరకూ నీళ్లు పోసి.. అందులో ఉపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో కాళ్లను ఉంచాలి. ఇలా చేసినా కూడా నొప్పులు తగ్గుతాయి. కావాలనుకుంటే గోరు వెచ్చటి నీళ్లను అయినా వాడవచ్చు.

ఇలా ఇంటి చిట్కాలను ఉపయోగించి అరికాళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చే. ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటే ఇక వైద్యులను సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి