Eyes: కంటి దురద అనేది ఒక సాధారణ సమస్య. అలెర్జీ, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వాతావరణంలో మార్పు లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. అంతే కాకుండా చాలా సేపు కాంటాక్ట్ లెన్సులు వేసుకోవడం, కళ్లలో డస్ట్ మైట్స్ రావడం వల్ల కూడా కళ్లలో దురద వస్తుంది. ఈ దురద నుంచి ఉపశమనం పొందడానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటి గురించి తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్
మీ కళ్ళపై ఐస్ క్యూబ్‌లని ఉపయోగించడం వల్ల కళ్ల దురదను తగ్గించవచ్చు. ఇది కళ్ళ చికాకు, వాపు, ఎరుపును తొలగిస్తుంది. దీని కోసం కొన్ని ఐస్ క్యూబ్‌లను శుభ్రమైన గుడ్డలో చుట్టి, వాటిని మీ కళ్ళపై కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇది కాకుండా మీరు మీ కళ్ళపై ఐస్ క్యూబ్ నీటిని కూడా చల్లుకోవచ్చు. దురద నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు 2-3 సార్లు ఇలా చేస్తే సరిపోతుంది.
గ్రీన్ టీ బ్యాగ్స్
గ్రీన్ టీలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కళ్ల దురదను తగ్గిస్తుంది. మీరు కళ్లకు లావెండర్ టీ బ్యాగ్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చికాకును తగ్గిస్తాయి. టీ బ్యాగ్‌లను 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత వాటిని మీ కళ్లపై 15-20 నిమిషాలు పెడితే మంచి ఉపశమనం ఉంటుంది.
ఆముదం
కంటి దురదను ఆముదంతో నయం చేయవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది కళ్ల దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్గానిక్ కాస్టర్ ఆయిల్‌ను అప్లై చేయడానికి, కాటన్ బాల్స్‌ను నూనెలో నానబెట్టి అందులో నుంచి నూనెను పిండేసి ఆ కాటన్‌తో కళ్లపై రుద్దాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో కడిగితే సరిపోతుంది.
దోసకాయ ముక్కలు
దోసకాయలో విటమిన్ బి6, రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి కళ్లకు అత్యంత ప్రయోజనకరమైన పదార్థాలు. దోసకాయలోని నీటి కంటెంట్ కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా చేస్తుంది. దోసకాయ ముక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కళ్ల దురదను తగ్గించడంలో తోడ్పడుతాయి. కేవలం దోసకాయని రెండు ముక్కలుగా కట్ చేసి వాటిని 10-15 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచాలి. తర్వాత మీ కళ్లపై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.