అవి సైలెంట్ కిల్లర్ లక్షణాలే.. ముఖం మీద ఈ 5 సంకేతాలు కనిపిస్తే అస్సలు నెగ్లెట్ చేయొద్దు

హై కొలెస్ట్రాల్ కొంప ముంచుతోంది.. LDL లేదా అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువని.. దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. క్రమంగా ప్రాణాలకే పెనుముప్పుగా వాటిల్లుతుందని.. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

అవి సైలెంట్ కిల్లర్ లక్షణాలే.. ముఖం మీద ఈ 5 సంకేతాలు కనిపిస్తే అస్సలు నెగ్లెట్ చేయొద్దు
High Cholesterol Face Signs

Updated on: Jul 21, 2025 | 1:12 PM

హై కొలెస్ట్రాల్ కొంప ముంచుతోంది.. LDL లేదా అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువని.. దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. క్రమంగా ప్రాణాలకే పెనుముప్పుగా వాటిల్లుతుందని.. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అందుకే.. అధిక కొలెస్ట్రాల్‌ను తరచుగా ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు.. దాని లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించవు.. అది శరీరాన్ని ప్రభావితం చేసే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. కానీ మీ ముఖంపై కూడా అధిక కొలెస్ట్రాల్ కొన్ని సంకేతాలు కనిపిస్తాయని మీకు తెలుసా? అవును.. హై కొలెస్ట్రాల్ లక్షణాలు మొహం పై కూడా కనిపిస్తాయి.. దీనిపై మీరు శ్రద్ధ వహిస్తే, శరీరం ఈ తీవ్రమైన పరిస్థితిని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుంది.. ఆ తర్వాత చికిత్స కూడా సులభం అవుతుంది.

ముఖం మీద కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు

కళ్ళ చుట్టూ పసుపు లేదా తెలుపు నిక్షేపాలు (క్సాంథెలాస్మా)..

మీ కళ్ళ మూలల్లో చిన్న పసుపు లేదా తెలుపు గడ్డలు లేదా మచ్చలు కనిపిస్తే, అవి కొలెస్ట్రాల్ నిక్షేపాలు కావచ్చు. వీటిని క్సాంథెలాస్మా అని పిలుస్తారు.. శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉందని సంకేతం కావచ్చు.

కంటి కనుపాప చుట్టూ తెల్లటి వలయం (ఆర్కస్ సెనిలిస్)..

కొంతమందికి కంటి కనుపాప (ఐరిస్) చుట్టూ బూడిదరంగు లేదా తెలుపు వలయం ఏర్పడుతుంది. ఇది తరచుగా వయస్సుతో పాటు కనిపిస్తుంది.. కానీ 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఇది కనిపిస్తే, అది అధిక కొలెస్ట్రాల్ సంకేతం కావచ్చు.

ముఖ చర్మం పాలిపోవడం లేదా అలసట..

ముఖం తరచుగా పాలిపోయినట్లు, అలసిపోయినట్లు లేదా వాపుగా కనిపిస్తే, ఇది రక్తంలో కొలెస్ట్రాల్ అసమతుల్యత వల్ల కావచ్చు.. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండదు.

పెదవుల రంగులో మార్పు..

అధిక కొలెస్ట్రాల్ రక్త ధమనులు ఇరుకుగా మారడానికి కారణమవుతుంది. ఇది పెదవులు.. ముఖానికి రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పెదవులు లేత నీలం లేదా తెల్లగా కనిపిస్తాయి.

కళ్ళలో తరచుగా మంట లేదా భారంగా అనిపించడం

కొలెస్ట్రాల్ కారణంగా కళ్ళ నరాలు ప్రభావితమవుతాయి.. దీని కారణంగా అలసట, మంట లేదా కళ్ళలో భారంగా అనిపించవచ్చు.

వెంటనే పరీక్ష చేయించుకోండి

ముఖంలో కనిపించే ఈ చిన్న మార్పులు శరీరం లోపల జరుగుతున్న పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా మీకు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.. ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని.. మీ కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేసుకోండి. సకాలంలో జాగ్రత్తగా ఉండటం ద్వారా.. పెను ముప్పు నుంచి తప్పించుకోవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..