Heatstroke: ఎండలు ముదురుతున్నాయ్.. ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త.. ముందే మేల్కోండి..

శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం ఉన్నట్లు లెక్క. ఒకవేళ మీ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి.

Heatstroke: ఎండలు ముదురుతున్నాయ్.. ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త.. ముందే మేల్కోండి..
Heatstroke

Updated on: Mar 11, 2023 | 5:30 PM

లాంగ్ వింటర్ సీజన్ అయిపోయింది. ఇక భానుడు భగ్గుమనే సమయం ఆసన్నమైంది. సాధారణంగా ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లకు కొత్త చిగురు వస్తూ ఉంటుంది. చెట్లన్నీ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో నెమ్మదిగా వేడి కూడా పెరుగుతుంటుంది. అయితే ఈ సారి మార్చి మొదలవుతూనే వేడి వాతావరణాన్ని వెంటబెట్టుకొచ్చింది. మొదటి వారం ముగిసిందో లేదో అప్పుడే సూర్యుడు భగభగలు మొదలు పెట్టాడు. ప్రభుత్వం కూడా అప్పుడే వేసవి జాగ్రత్తలు సూచించడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపు తప్పుతుంది. శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే, ఇంట్లో కుర్చున్నవారికి కూడా వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి? దానికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.

వడదెబ్బ అంటే ఏమిటి?

శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే మెదడు దెబ్బతింటుంది. అంతర్గత అవయవాల పనితీరును కూడా పాడవుతుంది.

వడదెబ్బ లక్షణాలు ఇవి..

దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో అసలు వడదెబ్బకు గురైనప్పుడు కలిగే సంకేతాలు ఏంటో ఓ సారి చూద్దాం. వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిది.. అనుకోకుండా సంభవిస్తుంది. దీని వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపుతప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవ్వుతారు. కళ్లు మసకబారుతాయి. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కళ్లు లాగుతాయి. తలనొప్పి వస్తుంది.
వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు ఏర్పడతాయి. దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే స్పృహ కోల్పోతారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవ్వుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచించుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతింటాయి.

ఇవి కూడా చదవండి

ఇవి పాటించండి..

  • ఎండకాలంలో చమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు కలిపిన ద్రవాలు ఉంటే మంచింది.
  • వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి.
  • నూనె పదార్థాల వాడకం తగ్గించడం మంచిది.
  • కొబ్బరి బోండాం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
  • వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి. తలకు క్యాప్ కూడా పెట్టుకుంటే మంచిది.
  • ఎం ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..