Healty Drinks: ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాం. అయితే, ముఖ్యంగా వేసవిలో వ్యాయామం చేసిన తరువాత విపరీతమైన దాహం వేస్తుంది. అలాంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవచ్చు. మరి వ్యాయామం చేసిన తరువాత ఎలాంటి డ్రింక్స్ తాగొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిమ్మరసం: వ్యాయామం తర్వాత నిమ్మరసం త్రాగాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, నిమ్మరసంలో చక్కెరను ఉపయోగించవద్దు. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
పుచ్చకాయ రసం: ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ శరీరంలోని వేడిని తొలగిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్: వ్యాయామం తర్వాత ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు పెరగదు.
దానిమ్మ జ్యూస్: వ్యాయామం తర్వాత ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. వేడి నుండి ఉపశమనం ఇస్తుంది.