Pregnancy Diet Plans : ఆ సమయంలో ఇవి తింటే తెలివైన, చురుకైన శిశువు మీ సొంతం

|

Mar 01, 2021 | 6:11 PM

ఏ తల్లిదండ్రులైనా తమకు పుట్టబోయే బిడ్డ.. ఆరోగ్యంగా తెలివైన చురుకైన వారుగా ఉండాలని కోరుకొంటారు.. ఇక తల్లి అయితే.. తనకు పుట్టబోయే బిడ్డ గురించి కనే కలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి క్షణం తన బిడ్డ స్పర్శను..

Pregnancy Diet Plans :  ఆ సమయంలో ఇవి తింటే తెలివైన, చురుకైన శిశువు మీ సొంతం
Follow us on

Pregnancy Diet Plans : ఏ తల్లిదండ్రులైనా తమకు పుట్టబోయే బిడ్డ.. ఆరోగ్యంగా తెలివైన చురుకైన వారుగా ఉండాలని కోరుకొంటారు.. ఇక తల్లి అయితే.. తనకు పుట్టబోయే బిడ్డ గురించి కనే కలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి క్షణం తన బిడ్డ స్పర్శను అనుభవిస్తూ.. ఆ శిశివుతో మాట్లాడుతూ.. ఎన్నో కలలు కంటుంది.. కథలు చెబుతుంది. కాగా ఇలా తెలివైన, చురుకైన బిడ్డ కోసం.. ఆ బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండడం కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

గర్భవతి అయిన మహిళ తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని .. గుడ్డులోని పచ్చసొన, నట్స్, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయల వంటి ఆహారం డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లికడుపులో ఉన్న సమయంలో బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి బూస్ట్ ఇస్తుందని… గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయంలోని కొలైన్ విరివిగా తీసుకోవాలని ఓ అధ్యయనం లో తేలింది.

కాగా ఎంత చదువుకున్న మహిళలైనా గర్భ ధారణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో చివరి మూడు నెలల్లో తల్లి తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం అని.. కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, చేపలు, గుడ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనంలో తెల్సింది. తినే ఆహార పదార్ధాలతో బిడ్డ ఎదుగుదల, జ్ఞాపకశక్తి మెరుగుపడిందట.. గర్భధారణ సమయంలో చివరి మూడు నెలలు.. కోలైన్ రిచ్ ఫుడ్స్ తింటే.. పాపాయి ఎదుగుదల బాగుంటుంది.

తల్లి గర్భంలోని బిడ్డ పెరుదల పై న్యూ యార్క్ లోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, మేరీ కాడిల్ అధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. తమ అధ్యయనంలో రెండు గ్రూపులు గర్భిణీలను పరిశీలించినట్లు మొదటి గ్రూప్ కి రోజూ కోలిన్ మి.గ్రా. ఇవ్వగా… రెండో గ్రూప్ కు రోజు కు 480 మి.గ్రా ఇచ్చారు. కాగా మొదటి గ్రూప్ శిశువు మెదడు అభివృధ్ధి గణనీయంగా పెరిగింది. ఈ ఎఫ్ ఏ ఎస్ ఈ బీ అనే జర్నల్ ఈ అధ్యయనం గురించి ప్రచురించింది.

Also Read:

తెలుగు సినీ చరిత్రను తిరగరాసి థియేటర్స్‌లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఏమిటో తెలుసా..!

బయోపిక్‌లో హీరోగా నటిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..