Turmeric Side Effects: వంటల్లో పసుపును ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ దుష్ప్రభావాలు తప్పవు..

|

May 01, 2022 | 1:43 PM

Health Tips:భారతీయ వంటకాలకు సంబంధించి తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది వంటకాల రంగు, రుచిని పెంచుతుంది

Turmeric Side Effects: వంటల్లో పసుపును ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ దుష్ప్రభావాలు తప్పవు..
Turmeric Side Effects
Follow us on

Health Tips:భారతీయ వంటకాలకు సంబంధించి తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది వంటకాల రంగు, రుచిని పెంచుతుంది. ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, సోడియం, క్రిమినాశక, విటమిన్ సి, తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా కర్కుమిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు పసుపును కూడా మితంగానే ఉపయోగించాలి. లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు హాని కలుగుతుంది.

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు,..

కిడ్నీలో రాళ్లు..

చాలా మందికి కిడ్నీలతో పాటు శరీరంలో తరచుగా రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాత పసుపును వినియోగించాలి. పసుపులో ఆక్సలేట్ ఉంటుంది. దీంతో క్యాల్షియం శరీరంలో కరిగిపోవడానికి బదులుగా ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. అవి క్రమంగా చిన్న చిన్న రాళ్లుగా మారిపోతాయి. అందుకే పసుపును మితంగా తీసుకోవాలి.

విరేచనాలు, వాంతులు..

పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు.

మధుమేహం

మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనె వంటకాలు, ఫ్రైడ్‌ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. అదేవిధంగా పసుపును కూడా మితంగా తీసుకోవాలి.

ఐరన్‌ లోపం

శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ పూర్తిస్థాయిలో అందదు. అందువల్ల శరీరంలో ఐరన్‌ స్థాయులు తక్కువున్న వారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

ముక్కులో రక్తస్రావం..

చాలా మంది తరచుగా ముక్కులో రక్తం పడుతుంటుంది . ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడి కారణంగా ఇలా జరుగుతుంటుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిమి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు నుంచి రక్త స్రావం మరింత ఎక్కువ కావొచ్చు.

కామెర్లు

కామెర్ల సమస్య ఉన్నవారు వీలైనంతవరకు పసుపుకు దూరంగా ఉండాలి. వారు దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. కామెర్లు ఉన్న రోగులు వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే పసుపును తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్‌.. సూర్యకుమార్‌ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..

Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

IPL 2022: రెండు పరుగులకే రోహిత్‌ ఔట్‌.. నిరాశలో మునిగిపోయిన సతీమణి రితిక.. అశ్విన్‌ భార్య ఎలా ఓదార్చిందో మీరే చూడండి..