Health Tips: రాత్రిపూట పదే పదే పొడిదగ్గు వస్తోందా? భయపడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే చాలు..

|

Sep 26, 2022 | 2:27 PM

Health Tips: దగ్గు వలన శ్వాసనాళాలు శుభ్రమవుతాయి. శ్లేష్మం వంటి వ్యర్థాలు వాయునాళంలో, గొంతులో పేరుకుపోయినప్పుడు..

Health Tips: రాత్రిపూట పదే పదే పొడిదగ్గు వస్తోందా? భయపడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే చాలు..
Cough
Follow us on

Health Tips: దగ్గు వలన శ్వాసనాళాలు శుభ్రమవుతాయి. శ్లేష్మం వంటి వ్యర్థాలు వాయునాళంలో, గొంతులో పేరుకుపోయినప్పుడు.. మన శరీరం దానిని దగ్గు ద్వారా బయటకు పంపిస్తుంది. అయితే, వరుసగా చాలా రోజులు కొనసాగితే మాత్రం ఆరోగ్యానికి ఇబ్బందే. చాలా మందికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు పొడి దగ్గు సమస్య ఉంటుంది. ఈ పొడి దగ్గు నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ఛాతీ నొప్పిని కూడా కలిగిస్తుంది. అయితే, రాత్రిపూట వచ్చే పొడి దగ్గుకు ఇంటి నివారణలతో చెక్ పెట్టొచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం, బెల్లం..

బెల్లం వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సహజ చక్కెరను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. పొడి దగ్గు పోవాలంటే బెల్లం, అల్లం కలిపి తినాలి. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా బెల్లం వేడి చేసి అందులో అల్లం తురుము గానీ, అల్లం రసం గానీ కలపాలి. కొన్ని రోజులు దీనిని ఇలాగే తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులు..

పొడి దగ్గు సమస్యను దూరం చేయడంలో తులసి ఆకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. తులసి ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు కొన్ని తులసి ఆకులను తేనెతో కలిపి తినాలి. ఇది దగ్గు సమస్యను తగ్గిస్తుంది.

నల్ల మిరియాలు, ఉప్పు..

దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మరొక గొప్ప మార్గం నల్లమిరియాలు, ఉప్పు. ఒక పాత్రలో నల్లమిరియాల పొడి తీసుకుని, దానికి కొద్దిగా ఉప్పు కలపాలి. దీంతోపాటు కొంచెం తేనె కూడా కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తింటే పొడి దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేడి నీటిలో తేనె..

గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రాత్రిపూట వచ్చే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ వేడి నీటి వల్ల అనేక సమస్యలు సమసిపోతాయి. గొంతు సమస్యలు సహా, పొడిదగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఈ ఆర్టికల్‌ను పబ్లిష్ చేయడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వారి సలహా మేరకే పై చిట్కాలను పాటించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..