Healthy Lungs: దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారా? ఈ 5 పండ్లను రోజూ తింటే అద్భుత ఫలితం..

|

Sep 19, 2022 | 12:41 PM

Healthy Lungs: కోవిడ్ తరువాత చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు..

Healthy Lungs: దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారా? ఈ 5 పండ్లను రోజూ తింటే అద్భుత ఫలితం..
Lungs Health
Follow us on

Healthy Lungs: కోవిడ్ తరువాత చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. తొలుత తేలికపాటి కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు సైతం తరువాత రోజుల్లో అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే వాయుకాలుష్యం వల్ల కూడా రకరకాల వ్యాధులు ఊపిరితిత్తులను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ఆస్తమా సమస్య సర్వసాధారణం. కాలుష్యం కారణంగా తీవ్రమైన దగ్గు, ఇతర సమస్యలు జనాలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి 5 రకాల ఆహారాలను సూచించారు నిపుణులు. వాటిని రోజూ తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయంటున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్..

రోజూ ఒక యాపిల్ తింటే వైద్యులకు దూరంగా ఉండవచ్చు. యాపిల్ శరీరానికి చాలా ప్రయోజనాలనందిస్తుంది. యాపిల్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్య సంరక్షణలో అద్భుతంగా పని చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలి.

జామ్/ పీచ్..

మార్కెట్‌లో అనేక రకాల పండ్లు లభిస్తాయి. బెర్రీలు, పీచెస్ కూడా ఏడాది పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. హిమాలయన్ వైల్డ్ బేర్రీస్ కూడా అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని అదనపు టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. అందుకే రోజూ ఆహారంలో వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

జామ..

మన దేశంలో ఏడాది పొడవునా అత్యంత చౌకగా లభించే పండు జామ. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగి ఉంటుంది. అందుకే జామ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా సమస్యలు ఉన్నవారు రోజూ మధ్యాహ్నం పూట ఒక జామపండు తింటే తేడా కనిపిస్తుంది. అయితే, బాగా పండిన జామ పండు తినొద్దు. జామలో ఫ్లేవినాయిడ్స్ ఉంటాయి. ఇది కొన్ని తీవ్రమైన వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

ఉసిరి..

ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతీరోజూ ఉసిరికాయ రసం తాగడం వలన మంచి జరుగుతుంది.

బత్తాయిలు..

బత్తాయిల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటుంది. రోజూ ఒక బత్తాయి తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ బత్తాయి రసం తాగడం వలన బహుళ ప్రయోజనాలు పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..