AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ జ్యూస్ లు తాగితే మీ ఆరోగ్యం ఎంతో పదిలం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..

ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే చాలా మంది కూల్ డ్రింక్ లు బదులు పండ్ల రసాలు.. ఇంకా చెప్పాలంటే జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల జ్యూసులతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జ్యూస్ అనే సరికి ఏదైనా పర్వాలేదులే..

Health Tips: ఈ జ్యూస్ లు తాగితే మీ ఆరోగ్యం ఎంతో పదిలం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
Fruit Juices
Amarnadh Daneti
|

Updated on: Sep 19, 2022 | 11:36 AM

Share

Health Tips: ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే చాలా మంది కూల్ డ్రింక్ లు బదులు పండ్ల రసాలు.. ఇంకా చెప్పాలంటే జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల జ్యూసులతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జ్యూస్ అనే సరికి ఏదైనా పర్వాలేదులే అనే ఉద్దేశంతో తాగేస్తూ ఉంటాం. కాని కొన్ని జ్యూస్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి జ్యూస్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు తులసి నివారణగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ప్రతిరోజూ పండ్లు, కూరగాయల రసాలను తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలు, ఎరేటెడ్ పానీయాలు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. తులసి ఆకులు రసం చేసి జ్యూస్‌లను రోజూ తాగితే ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. ఆకుపచ్చని తులసి కంటే కృష్ణ తులసి ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. పుచ్చకాయ రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా పుచ్చకాయ రసం సహాయపడుతుంది.

పుచ్చకాయ జ్యూస్ రోజూ తాగటంతో పాటు ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా వంటివి తీసుకోవడం తగ్గించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్ జ్యూస్‌ తాగితే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. ఈ జ్యూస్‌ తాగటం ద్వారా కాల్షియం, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె శరీరానికి అందుతాయి. శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలను క్యారెట్ జ్యూస్ భర్తీ చేస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు ఇంకా చాలానే ఉన్నాయి. నాడీ వ్యవస్థ, చర్మం, జుట్టు, రక్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఏపడిన కణితిలను నయం చేయడంలో, ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
ఆసీస్‌‌తోపాటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్?
ఆసీస్‌‌తోపాటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్?
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..