Health Tips: ఈ డ్రింక్స్ మీ ఎముకలను బలహీనపరుస్తాయి.. వెంటనే తాగడం మానేయండి..

|

Sep 04, 2023 | 6:44 AM

మనం దాహం వేస్తే నీటిని తాగుతాం. చల్లగా తాగాలనిపిస్తే ఫ్రిజ్ నుంచి నీళ్లు తీసుకుని తాగుతాం. లేదంటే.. ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం. ఎవరికి నచ్చింది వాళ్లు డ్రింక్స్ తాగుతుంటారు. అయితే, రోజువారీగా మీరు తాగే కొన్ని డ్రింక్స్.. మీరు ఊహించలేనంత హానీ చేసేవి ఉన్నాయి. ప్రతి రోజూ మీ శరీరంలోని ఎముకలను కరిగించి, మరింత బలహీనపరుస్తాయి. ఈ డ్రింక్స్ మీ ఎముకలకే కాదు..

Health Tips: ఈ డ్రింక్స్ మీ ఎముకలను బలహీనపరుస్తాయి.. వెంటనే తాగడం మానేయండి..
Bone Health
Follow us on

Bone Health: మనం దాహం వేస్తే నీటిని తాగుతాం. చల్లగా తాగాలనిపిస్తే ఫ్రిజ్ నుంచి నీళ్లు తీసుకుని తాగుతాం. లేదంటే.. ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం. ఎవరికి నచ్చింది వాళ్లు డ్రింక్స్ తాగుతుంటారు. అయితే, రోజువారీగా మీరు తాగే కొన్ని డ్రింక్స్.. మీరు ఊహించలేనంత హానీ చేసేవి ఉన్నాయి. ప్రతి రోజూ మీ శరీరంలోని ఎముకలను కరిగించి, మరింత బలహీనపరుస్తాయి. ఈ డ్రింక్స్ మీ ఎముకలకే కాదు.. మీ మొత్తం ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి. ఎముకల బలాన్ని తగ్గిస్తాయి. అధిక మొత్తంలో ఆల్కహాల్, కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, అధిక చక్కెర స్థాయిలు కలిగిన సోడాలను రోజూ తాగుతున్నట్లయితే.. మీ ఎముకలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి.

ఈ డ్రింక్స్ లలో ఉండే మూలకాల కారణంగా బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే.. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం, ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడే వ్యాయామాలను చేయడం చాలా ముఖ్యం. మరి ఎముకలను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే డ్రింక్స్ ఏంటో ఓసారి చూద్దాం.

సోడా: సోడాలో ఉండే సోడియం, అధిక చక్కెర మన ఎముకలకు హాని కలిగిస్తాయి. ఎముకల కాల్షియం స్థాయిని తగ్గించడంతో పాటు, వాటి బలాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

అధిక కెఫీన్: అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎముకల కాల్షియం స్థాయి తగ్గుతుంది. ఇది వాటిని బలహీనంగా చేస్తుంది.

ఆల్కహాల్: అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి.

షుగర్ డ్రింక్స్: షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న డ్రింక్స్ తాగడం వలన మన ఎముకలు బలహీనపడుతాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

ఈ డ్రింక్స్ నివారించడానికి.. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఉత్తమం. తద్వారా మీ ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ ని రోజువారీ డైట్ లో తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. పాలు, పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్, పెరుగు మొదలైన వాటిలో సహజమైన కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి.

2. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

3. కొబ్బరి నీరు: కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.

4. యాపిల్ జ్యూస్: యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

5. ఆకు కూరలు, పండ్లు: ఆకు కూరలు, పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి, ఇవి ఎముకలను బలపరుస్తాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలను పాటించడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..