Best Foods For Kidneys: మన శరీరంలో ఉండే అతి ముఖ్య మైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీల ప్రధాన భాద్యత.. శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉండే ఈ కిడ్నీలు మలినాలను తొలగించే ప్రక్రియలో కిడ్నీల్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్స్ వంటి వ్యాధులు రావచ్చు… అందుకే కిడ్నీలను తరచుగా శుభ్రం చేసుకొంటూ ఉండాలి.. కాగా కిడ్నీలను సహజంగా డిటాక్స్ చేయడం ఎలాగో తెలుసుకొందాం..!!
మంచి నీళ్లు:
కిడ్నీలను శుభ్రపరచడానికి మంచి నీరుకంటే మంచి సాధనం వేరే లేదు.. అందుకని ఏ విధమైన సమస్య లేని వారు 4 లీటర్ల నీరు.. ఏదైనా సమస్య ఉన్న వారు రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వరకూ మంచి నీరు తాగండి.. నీరు టాక్సిన్ పదార్ధాలను ఫిల్టర్ చేసి తొలగిస్తుంది. ముఖ్యంగా మీ మూత్రం ఎటువంటి దుర్వాసన లేకుండా.. ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారు అని అర్ధం.. మూత్రం లో ఏదైనా దుర్వాసన వస్తే.. మీ శరీరానికి ఇంకా నీరు అవసరం అని అర్ధం..
బార్లీ:
బార్లీ నీరు కిడ్నీలను శుబ్రపరచడమే కాదు.. కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా కాపాడే సామర్ధ్యం కలిగి ఉంటుంది. బార్లీ లో ఫైబర్ ఎక్కువుగా ఉండే ఒక ధాన్యం… ఈ బార్లీ మధుమేహ వ్యాధి నుంచి కూడా సమర్ధవంతంగా రక్షిస్తుంది. బార్లీ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల బార్లీలోని ఫైబర్ ని శరీరం స్వీకరిస్తుంది.. కిడ్నీ శుబ్రపరచడానికి బాగా ఊయపయోగపడుతుంది.
పొటాషియం ఉండే పండ్లు, కూరగాయలు, బెర్రీస్:
పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, కమలఫలం, నారింజ, కీవీ, అప్రికాట్ వంటి పండ్లను ఎక్కువగా తినాలి.. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ లను రోజూ తినాలి.. వీటిల్లో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గా మరి కిడ్నీలను శుభ్రపరచడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కాగా కిడ్నీల ఆరోగ్యం పై ప్రభావం చూపే ఆల్కహాల్, చాకోలేట్, కెప్ఫిన్ లకు దూరంగా ఉండాలి.. వీటి వల్ల కిడ్నీలకే కాదు… మొత్తం శరీరం పై కూడా దుష్ప్రభావం కలుగుతుంది. వీటిని అరిగించే కరిగించే క్రమంలో కిడ్నీల పై ప్రభావం చాలా పడుతుంది.. దీంతో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది.
Also Read: అయ్యో పాపం.. చిన్నారి వయసు రెండేళ్లు.. బరువు మాత్రం 45 కిలోలు.. అరుదైన సర్జరీ చేసిన వైద్యులు..!
దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
Health Tips: బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు బెస్ట్..! వ్యాధులు కూడా దూరం.. తెలుసుకోండి