Health Tips: మెంతుకూర, బచ్చలి కూరలో ఏది ఆరోగ్యకరమైనది.. ఎక్కువ మేలు దేనితో వస్తుంది.. పూర్తివివరాలివే..

ఓవైపు అస్తవ్యస్తమైన జీవనశైలి.. మరోవైపు వాతావరణ మార్పులు.. ప్రజలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా కోలుకున్నారో లేదో.. అలా మరో వ్యాధి బారిన పడుతున్నారు.

Health Tips: మెంతుకూర, బచ్చలి కూరలో ఏది ఆరోగ్యకరమైనది.. ఎక్కువ మేలు దేనితో వస్తుంది.. పూర్తివివరాలివే..
Spinach And Fenugreek

Updated on: Oct 27, 2022 | 9:55 PM

ఓవైపు అస్తవ్యస్తమైన జీవనశైలి.. మరోవైపు వాతావరణ మార్పులు.. ప్రజలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా కోలుకున్నారో లేదో.. అలా మరో వ్యాధి బారిన పడుతున్నారు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు వేధిస్తాయి. అయితే, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం మాదిరిగానే చలికాలంలోనే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో ఆరోగ్యం కోసం ఆకు కూరలు తీసుకోవచ్చు. ఆకు కూరగాయల్లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అయితే, చాలామంది ప్రజలు ఈ సీజన్‌లో బచ్చలికూర, మెంతు కూర తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు కూరగాయలు వేర్వేరు ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు ఆకు కూరల్లో ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాన్ని ఇస్తుందో ఇవాళ మనం తెలుసుకుందాం..

బచ్చలి కూర..

బచ్చలి కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎవరికైనా శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లయితే బచ్చలికూర తినడం మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. బచ్చలికూరలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె, ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి. బచ్చలి కూర తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మెంతి కూర..

మెంతికూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. మెంతుకూర తినడం వల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అదనంగా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చలికాలంలో మెంతికూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బచ్చలికూర, మెంతికూర తేడాలు..

1. రక్తం పలుచబడటం వంటి సమస్య ఉన్నవారు బచ్చలి కూరకు దూరంగా ఉండాలి.

2. రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు బచ్చలికూరను తినొచ్చు.

3. డయాబెటిక్ రోగులు వైద్యుల సలహా లేకుండా ఈ కూరను తీసుకోవద్దు.

4. డైట్ మెయింటేన్ చేస్తున్నట్లయితే బచ్చలికూరకు బదులుగా మెంతుకూర తినడం ఉత్తమం.

5. మెంతుల్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

6. 100 గ్రాముల మెంతికూరలో 2.9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

7. 100 గ్రాముల బచ్చలికూరలో 6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

8. మెంతుకూరలో బచ్చలికూర కంటే ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది.

9. మెంతుకూర వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..