
ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యానికి గురికావాలన్నా అన్నింటికి మూల కారణం జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే.. అనేక రోగాలు చుట్టుముడుతాయి. పొట్ట శుభ్రంగా లేకపోతే.. నిరంతరం వ్యాధులు వేధిస్తుంటాయి. అయితే, చాలా మంది ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవక అవస్థలు పడుతుంటారు. దీనికి కారణం గ్యాస్ట్రో పెరోసిస్ అని చెబుతున్నారు నిపుణులు. దీని కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ఉదర కండరాలు సరిగా పని చేయవు. ఫలితంగా కడుపు పూర్తిగా శుభ్రమవదు. ఈ రకమైన సమస్య ఉన్నవారు.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి అనేక హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
నీరు శరీరం నుండి, కడుపులోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీని వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. జీర్ణక్రియ బాగా ఉంటుంది. ఉదయాన్నే క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. రోజంతా 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలి. తద్వారా పొట్ట శుభ్రంగా ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. యాపిల్స్, బేరి, స్ట్రాబెర్రీ, క్యారెట్, బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్, ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని ఆహారంలో చేర్చవచ్చు.
నిమ్మరసంలో కాసింత తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి ఉదర సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి. దీంతో పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది.
శరీరానికి అవసరమైన అన్ని మూలకాలు ఆపిల్, నిమ్మ, కలబంద వంటి అనేక పండ్లు, కూరగాయలలో కనిపిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా జ్యూస్‌లు, స్మూతీస్ రూపంలో తాగడం వల్ల పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతాయి.
ఫైటోకెమికల్స్ కలిగిన అనేక మూలికలు ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగనివ్వవు. మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను అవి దూరం చేస్తాయి. ఉదయాన్నే కడుపుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కారణాల వల్ల కడుపు క్లియర్ అవ్వకపోతే ఈ ఐదు ఇంటి నివారణలు ఈ సమస్యను వదిలించుకోవడానికి సహాయపడతాయి.
హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..