Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!

|

Jan 16, 2024 | 8:17 AM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలోని పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నిండుగా, పోషకాలతో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే సమయానికి ఆహారం తీసుకోకపోతే అది మనకు చాలా హానికరమని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకునే వ్యక్తులు టైప్-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం

Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!
ఇలా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఇతర జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతో పాటు అధిక రక్తపోటు నుండి సేఫ్ అవ్వొచ్చు అని అంటున్నాయి. బ్రేక్‌ ఫాస్ట్‌ మానేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయని సర్వే తేల్చింది.
Follow us on

చాలా మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అలవాటు ఉంటుంది. ఉదయం టిఫిన్‌ చేశాకా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. అయితే కొందరు టిఫిన్ చేసే సమయ వేళలు పాటించరు. ఉదయం ఏ సమయానికి టిఫిన్‌ చేయాలి? సమయం దాటితో ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయం పెద్దగా పట్టించుకోరు. ఉదయం టిఫిన్‌ చేయడానికి ఓ టైమ్‌ అంటూ ఉంటుంది. ఆ సమయంలో లోపు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆలస్యంగా చేస్తుంటారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలలోపు9 ఆల్పాహారం చేయాలంటున్నారు నిపుణులు. ఉదయం అల్పాహారంపై ఐఎస్‌ గ్లోబస్‌ అధ్యయనం చేపట్టింది. ఇందులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉదయం 8 గంటల్లోపు తినేవారితో పోలిస్తే 9 గంటల తర్వాత టిఫిన్‌ చేసేవారిలో డయాబెటిస్‌ ముప్పు 59 శాతం ఉన్నట్లు తేలింది. తినే సమయ వేళలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వేళపాల లేకుండా టిఫిన్‌ చేస్తే రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదు వంటి వాటిపై ప్రభావం ఉంటుందట. అలాగే రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలో మధుమేహం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అధ్యయనం ద్వారా గుర్తించారు.

మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమలు తగ్గడం వల్ల అధిక రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన ఈ వ్యాధి పెరుగుతుంది. ఇది అటువంటి వ్యాధి, బాధితురాలిగా మారిన తర్వాత జీవితాంతం మందులపై ఆధారపడతారు. అందువల్ల, మధుమేహాన్ని నివారించడానికి, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం. ఇది కాకుండా, మధుమేహాన్ని సరైన సమయంలో గుర్తించినట్లయితే, అప్పుడు ఈ వ్యాధి సమస్యలు సంభవించే ముందు నివారించవచ్చు. అందుకే ఆహారం తీసుకోవడంలో సమయ వేళలు పాటించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలోని పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నిండుగా, పోషకాలతో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే సమయానికి ఆహారం తీసుకోకపోతే అది మనకు చాలా హానికరమని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకునే వ్యక్తులు టైప్-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. గతంలో కూడా అమెరికాలో జరిపిన అధ్యయనం ఆధారంగా నిపుణులు ఈ నివేదికలో వెల్లడించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి