Health Tips: ప్రస్తుత బిజీ లైఫ్‌లో నిద్ర నుంచి లేవడమే ఆలస్యం.. ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధం అవడం, హడావిడిగా వంట చేయడం, స్నానం చేయడం అన్నీ చకచకా చేసేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఆఫీస్‌కు లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. స్నానం చేసిన వెంటనే భోజనం, టిఫిన్ చేస్తుంటారు. కానీ, అలా స్నానం చేసిన వెంటనే భోజనం, టిఫిన్ చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారి తీస్తుంది. స్నానం చేసిన వెంటనే తింటే ఏం జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం..
1. స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తే ఎసిడిటీ, గుండెల్లో మంట, అసౌకర్యం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే తినడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. కడుపు చుట్టూ ఉన్న రక్తం శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహించడం జరుగుతుంది.
2. రోజువారీ కార్యకలాపాలకు నిర్దిష్ట సమయాలను షెడ్యూల్ చేయాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. అలాకాకుండా సమయపాలన లేకుండా తినడం వలన మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
3. ఆహారం కడుపులోకి వెళ్లినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఇది అసౌకర్యం, ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, బరువు పెరుగుట, ఊబకాయం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
4. స్నానం చేసిన తర్వాత తినడానికి, స్నానానికి ముందు తినడానికి కనీసం 2-3 గంటలు వేచి ఉండాలని వైద్యులు అంటున్నారు. ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమయాభావం కారణంగా ప్రతిదీ హడావిడిగా ఉన్నప్పుడు.. స్నానానికి ఎక్కువ సమయం ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఏదైనా తినే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.
5. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే హైపర్‌థెర్మిక్ రియాక్షన్ ప్రక్రియ పెరుగుతుంది. వెచ్చని షవర్ నాడీ వ్యవస్థను సడలిస్తుంది. రోగనిరోధక, జీర్ణ వ్యవస్థలను ప్రేరేపిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని బయటకు పంపి, జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..