Fitness Tips: అధిక శరీర బరువును తగ్గించే ఐదు అద్భుత డ్రింక్స్.. పూర్తి వివరాలివే..

|

Aug 01, 2022 | 7:22 AM

Fitness Tips: ప్రస్తుత బిజీ లైఫ్‌లో తప్పుడు జీవనశైలి కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతోంది. అందుకే కొందరు జిమ్‌కి వెళ్లి కఠోర శిక్షణ తీసుకుంటారు.

Fitness Tips: అధిక శరీర బరువును తగ్గించే ఐదు అద్భుత డ్రింక్స్.. పూర్తి వివరాలివే..
Health Drinks
Follow us on

Fitness Tips: ప్రస్తుత బిజీ లైఫ్‌లో తప్పుడు జీవనశైలి కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతోంది. అందుకే కొందరు జిమ్‌కి వెళ్లి కఠోర శిక్షణ తీసుకుంటారు. మరికొందరు ఔట్ డోర్ వ్యాయామాలు చేస్తుంటారు. మరి ఇంట్లో ఉండి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు తగ్గాలనుకోవాలనుకుంటే.. కొన్ని డ్రింక్స్, కొన్ని వ్యాయామాలు చేస్తే చాలని చెబుతున్నారు. ముఖ్యంగా 5 నేచురల్ డ్రింక్స్ కొవ్వును కరిగిస్తాయంటున్నారు. మరి ఆ 5 డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీరా వాటర్:

జీరాను సాధారణంగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. జీరా వాటర్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట భాగంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని కూడా అణచివేస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

గ్రీన్ టీ:

గత కొన్ని దశాబ్దాలుగా గ్రీన్ టీ ప్రజాదరణ పొందింది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ఇందులో ఎక్కువ చక్కెర వేయొద్దు.

వాము డ్రింక్:

వాము గింజలు సహజంగా జీవక్రియను ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియ, ఆహారాన్ని గ్రహించడంలో సహాయపడతాయి. 2 టీస్పూన్ల పొడి వేయించిన వాము గింజలను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని బాగా కలుపుకుని తాగాలి.

సోంపు గింజల వాటర్:

సోంపు గింజలు అజీర్తి, అపానవాయువు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు సహకరిస్తుంది. సోంపు నిర్విషీకరణలో సహాయపడే మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ సోంపు గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి వడకట్టి మరుసటి రోజు ఉదయం తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..