Diabetic Food: మధుమేహ బాధితులకు వరం ఈ పండ్లు.. ఇవి తింటే ప్రయోజనాలెన్నో..

|

Aug 15, 2022 | 10:06 PM

Diabetic Food: మధుమేహ బాధితుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానందున.. రక్త ప్రవాహంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. ఫలితంగా వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

Diabetic Food: మధుమేహ బాధితులకు వరం ఈ పండ్లు.. ఇవి తింటే ప్రయోజనాలెన్నో..
Fruites
Follow us on

Diabetic Food: మధుమేహ బాధితుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానందున.. రక్త ప్రవాహంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. ఫలితంగా వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది వారి ఆరోగ్యానికి క్రమంగా క్షీణింపజేస్తుంది. డయాబెటిక్ వ్యక్తులు నిరంతరం వారి షుగర్ లెవల్స్‌ని చెక్ చేసుకుంటూ.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గించే ఆహారాలను, పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పండ్లు సహజ చక్కెరను కలిగి ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు వాటిని తినకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టకుండా తినగలిగే కొన్ని పండ్లను పేర్కొంది. మరి డయాబెటిక్ పేషెంట్స్ ఏం తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

పీచ్ ఫ్రూట్..
డయాబెటిక్ పేషెంట్స్ పీచ్ పళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ స్థాయిలను కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది.

యాపిల్స్..
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో పాలీఫెనాల్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి సహాయపడతాయి. చక్కెరను శక్తిగా మార్చడంలో కణాలకు సహాయపడుతుంది.

బెర్రీలు..
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున బెర్రీలు మధుమేహానికి అద్భుతమైనవి.

బ్లాక్ ప్లం..
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పండు అద్భుతంగా పని చేస్తుంది. జామూన్ అని కూడా పిలువబడే ఈ బ్లాక్‌బెర్రీలో రసాయనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పిండి పదార్థాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

జామ..
జామ పండులో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు కలిగిన పండు. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది. సులభంగా జీర్ణం కావడమే కాకుండా, ఇది నెమ్మదిగా కణాల ద్వారా గ్రహించబడుతుంది.

మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరమైన కొన్ని ఇతర పండ్లు ఆప్రికాట్లు, అవకాడోలు, ద్రాక్ష. అయితే, పండ్ల రసాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. వీటి జ్యూస్ తాగే ముందు నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..